రూ.10లక్షలు దాటితే సబ్సిడీ కట్‌

B4
Gas

రూ.10లక్షలు దాటితే సబ్సిడీ కట్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 20: పదిలక్షల రూపాయలు వార్షిక ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లింపుదారుల ఎల్‌పిజి గణాంకాలవివరాలు అంద చేయాలని ఆదాయపు పన్నుశాఖ పెట్రోలియం మంత్రిత్వశాఖకు లేఖాలు రాయడంతో మరో కొత్త విధానం ప్రారంభం అవు తున్నదన్న అందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పన్ను చెల్లింపుదారుల అందరి వివరాలను తెలుసుకునేందుకు వారి వార్షిక ఆదాయం పదిలక్షలు దాటి ఉన్న వారి వివ రాలను సేకరించేందుకు ఆదాయపు పన్నుశాఖ చమురు మంత్రిత్వశాఖతో జట్టుకడుతోంది. అలాగే సంపన్నులకు సబ్సిడీ వెళ్లకుండా కట్టడిచేసే కార్యాచరణకు కూడా ఇది వీలవుతుందని చమురుమంత్రిత్వశాఖ భావిస్తోంది వార్షిక ఆదాయం రూ.10 లక్షలుపైబడి, సబ్సిడీ గ్యాస్‌ పొందుతున్న వారి వివరాలను ముందుగా సేకరించి వారి పాన్‌నంబర్ల సాయంతో వీటిని క్రోడీకరించాలని నిర్ణయించింది.

పుట్టినదేదీ, మహిళలు, పురుషులు వంటి వాటితోపాటు మొత్తం అన్ని వివరాలను సేకరించాలని వీటిని ఐటి డేటాబేస్‌లో ఉన్నవాటితో సరిపోలుస్తుందని అంచనా. ఇందుకు సంబంధించి త్వరలోనే ఐటిశాఖ చమురుమంత్రిత్వశాఖతో ఎంఒయు చేసుకుంటున్నది. అంతేకాకుండా వ్యక్తుల ఇమెయిల్‌ ఐడిలు, నివాస ఫోన్‌, మొబైల్‌ నంబర్లను కూడా సేకరిస్తున్నది.ఈకార్యాచరణకు కేంద్ర ప్రత్యక్ష పన్నులబోర్డు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వం వార్షిక ఆదాయం పదిలక్షలకుపైబడిన వారికి వంటగ్యాస్‌ సబ్సిడీ అమలును నిలిపివేస్తామని ప్రకటించిన సంగతితెలిసిందే. పదిలక్షలకుపైబడి ఉన్న వారి వివరాలు ఈ జాబితాలో ఉంటే రెండుశాఖలు చేపట్టే కార్యాచరణ తో వాటికవే సబ్సిడీ జాబితానుంచి వైదొలుగుతాయి. ఇప్పటికే కొం దరు ప్రముఖులు స్వచ్ఛందంగా వారి సబ్సిడీని ఉపసంహరించు కున్నట్లు లేఖలు ఇచ్చారు. అయితే అత్యధికశాతం ఇప్పటికీ సబ్సిడీ ని పొందుతూనే ఉన్నారు. ప్రభుత్వం ఈతరహా అవక తవకలను నివారించి పదిలక్షల వార్షికపరిమితి మించి ఉన్నవారికి సబ్సిడీని నిలిపివేసేందుకు నిర్ణయిం చింది. ప్రస్తుతంఅన్ని కుటుంబాలు 14.2 కిలో ల సిలిండర్లు ఏడాదికి 12 సిలిండర్లు సబ్సిడీ రేట్లకు పొందే అవకాశంఉంది. ఇప్పటికే ప్రభు త్వం పలుపర్యాయాలు సంపన్న కుటుం బాలు, అత్యధిక వేతనం పొందే కుటుంబాల ను వారి సబ్సిడీగ్యాస్‌ను వదులుకోవాలని విజ్ఞప్తులుచేసి మార్కెట్‌ధరకు కొనుగోలుచేస్తే ఈ సబ్సిడీ మరికొందరు నిరుపేదలకు అమలుచేస్తామంటూ పలు ప్రకటనలు జారీచేసింది. గతఏడాదే ప్రభుత్వం ఎవరైనా భర్త కానీ, భార్యకానీ వార్షిక ఆదాయం 10లక్షల రూపాయలకుపైబడితే వారికి ఎల్‌పిజి సబ్సిడీ నిలిపివేయాలన్న నిర్ణయాన్ని ప్రకటించింది. ఆనిర్ణయం ఇపుడు అమలులోకి తెస్తున్నది. ఇందుకోసం రెండుశాఖల మధ్య ఒడం బడిక జరిగిన తర్వాత నుంచి కార్యాచరణ మొదలవుతుందని అంచనా.