రూల్స్ అతిక్రమణకు విరాట్‌కు జరిమానా

బెంగుళూరుః రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీకి ఐపీఎల్ రూ.12లక్షల జరిమానా విధించింది. టోర్నీలో భాగంగా బుధవారం బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత సమయానికి ఓవర్లు వేయలేకపోవడంతో ఈ జట్టు సారథి విరాట్ కోహ్లీకి రూ.12లక్షల జరిమానా విధించింది. ‘ఆర్సీబీ జట్టు ఐపీఎల్ ఓవర్ రేట్ నియమావళిని అతిక్రమించింది. ఇలా చేయడం ఈ జట్టుకు ఇదే తొలిసారి. ఈ కారణంగానే ఆ జట్టు సారథి విరాట్ కోహ్లీకి రూ.12లక్షల జరిమానా విధిస్తున్నాం’ అని ఐపీఎల్ నిర్వాహకులు మీడియాకు లేఖ విడుదల చేశారు.ఆర్సీబీకి ఈ టోర్నీలో ఇది నాలుగో పరాజయం. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా కేవలం రెండింట్లోనే విజయం సాధించింది.