రూపాయిపతనంతో నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

Stock market
Stock market

ముంబాయి: నేడు దేశీయమార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఉదయం భారీ నష్టాలతోనే ప్రారంభమైన సూచీలు ఆఖరున కూడా నష్టాలనే మిగిల్చాయి. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ నేడు భారీ పతనమవడం మార్కెట్లపై బాగా ప్రభావం చూపింది. ఐటీ,ఫార్మా రంగ షేర్లు లాభాలను నమోదు చేసినప్పటికీ బ్యాంకింగ్‌, ఇంధన, లోహ, ఆటో తదితర రంగాల షేర్ల నష్టాలను మూటగట్టుకోవడంతో సూచీలు డీలా పడ్డాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టర్కీపై ఆంక్షలు విధించడంతో ఆ దేశా కరెన్సీ టర్కీష్‌ లిరా విలువ జీవనకాల కనిష్టానికి పడిపోవడంతో ఇతర దేశాల కరెన్సీలు కూడా బలహీనపడ్డాయి. నేటి ట్రేడింగ్‌ డాలరుతో రూపాయి మారకం విలువ రూ.69.83వద్ద కొనసాగుతోంది. బిఎస్‌ఈ సెన్సెక్స్‌ 268పాయింట్ల నష్టంతో 37.600పాయింట్ల వద్ద ప్రారంభంకాగా,నిఫ్టీ 74పాయింట్ల నష్టంతో 11.356 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. తుదికంటా నష్టాలోనే కొనసాగిన మార్కెట్లు చివరకు సెన్సెక్స్‌ 224.33పాయింట్ల నష్టంతో 37645వద్ద ముగిసింది. నిఫ్టీ 73.70పాయింట్లు నష్టపోయి 11355.75పాయింట్లకు చేరింది. నేటి ట్రేడింగ్‌లో గెయిల్‌,టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, హచ్‌సిఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌ తదితద కంపెనల షేర్లు లాభపడ్డాయి. బిపిసిఎల్‌, హెచ్‌సిఎల్‌, ఐడియా సెల్యూలార్‌, ఎస్‌బిఐ, వేదాంత తదితర కంపెనీల షేర్లు నష్టాలపాలయ్యాయి.