రూట్ పరుగుల వరద: 218

భార‌త్ – ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు

Root double century
Root double century

Chennai: భార‌త్ – ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య కొన‌సాగుతున్న‌ తొలి టెస్టులో ఇంగ్లండ్ సార‌ధి రూట్ ద్విశతకంతో రాణించాడు, ఆల్ రౌండ‌ర్ బెన్ స్ర్టాక్స్ 82 పరుగులు చేశాడు..

రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 555/8 స్కోరును సాధించింది. 555 పరుగులతో పటిష్ఠ స్థితిలో కొనసాగుతోంది .

ప్రస్తుతం క్రీజులో డొమినిక్ బెస్ (28), జాక్ లీచ్ (6) ఉన్నారు. ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ తన 100 టెస్ట్‌లో ద్విశతకంతో రాణించాడు. గత మూడు టెస్టుల్లో రూట్‌కిది రెండో ద్విశతకం. దీంతో ఆస్ట్రేలియా మాజీ సారథి డాన్‌ బ్రాడ్‌మన్‌ తర్వాత వరసగా మూడు టెస్టుల్లో 150కి పైగా పరుగులు చేసిన ఏకైక సారథిగా రికార్డు సృష్టించాడు.