రుతుస్రావంతో జాగ్రత్త

EATING
EATING

రుతుస్రావంతో జాగ్రత్త

మనదేశంలో మహిళల్లో ఐరన్‌ లోపం చాలా ఎక్కువ. రుతుస్రావం వల్ల రక్తం కోల్పోవడంతో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రుతుస్రావంతో వచ్చే ఐరన్‌ లోపాన్ని అధిగమించడానికి ఆహారంలో ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

మాంసా హారంలో చికెన్‌,మటన్‌, చేపలు, కాలేయం (లివర్‌) వంటి వాటిలో ఐరన్‌ ఎక్కువ శాకాహారంలో ఆకు కూరలు (గ్రీన్‌ లీఫ్‌ వెజిటబుల్స్‌) ఖర్జూరం, నువ్ఞ్వలు, అటుకులు వంటి పదార్థాల్లో ఐరన్‌ ఎక్కువ. ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు కేవలం రుతుస్రావసమయంలో కాకుండా క్రమం తప్పకుండా నిత్యం (ప్రీమెన్‌స్ట్రుయేషన్‌) తీసుకోవాలి.

దీనివల్ల రక్తస్రావం ద్వారా కోల్పోయే రక్తాన్ని భర్తీ చేసుకునేందుకు వీలవ్ఞతుంది. రుతుస్రావం అయ్యే మహిళలు ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలి. దాంతో పాటు కొవ్ఞ్వ పదార్థాలు కూడా తక్కువగా తీసుకోవాలి.