రుణమాఫీ వల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం

RAGHURAM RAJAN
RAGHURAM RAJAN

న్యూఢిల్లీః  రైతు రుణమాఫీ పథకాల వలన దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ స్పష్టం చేశారు. రుణమాఫీల వల్ల రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలు అతలాకుతలం అవుతాయని చెప్పారు. పేదలకు లబ్ధి చేకూరకపోగా రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తులకే ఎక్కువ లాభం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో రైతుల రుణమాఫీ పథకం అమలు చేస్తామని చెప్పింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎంపి మాజీ సియం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ..కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందో లేదో వేచిచూడాలి అని ,ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందనే ఆశిస్తున్నానని అన్నారు. ఈ దిశగా ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే అడుగులు వేస్తుంది. బ్యాంకులు, ఆర్ధిక సంస్థల సహకారంతో రైతు రుణమాఫీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.