రీలాంచ్‌ మూవీగా భావిస్తున్నా

SRI_0593
PAISA VASOOL AUDIO FUNCTION

రీలాంచ్‌ మూవీగా భావిస్తున్నా

‘పైసావసూల్‌ ‘ ఆడియోలో నందమూరి నటసింహం బాలకృష

నందమూరి బాలకృష్ణ 101 వ చిత్రం భవ్య క్రియేషన్స్‌ రూపొందించిన పైసా వసూల్‌ ఆడియోవేడుక గురువారం సాయంత్రం ఖమ్మంలో వైభవోపేతంగా జరిగింది.వర్షం పడినప్పటికీ ఆద్యంతం కార్యక్రమం ప్రేక్షకుల అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య విజయవందమైంది. ఒక దశలో వర్షం ఆగిపోయింది. దీంతో కార్యక్రమంసజావుగా సాదింది. ఈసందర్భంగా దర్శకుడు పూరి జగన్నాద్‌ మాట్లాడుతూ, బాలయ్య మాటల్లో ఎపుడూ రెండే మాటలుంటాయని, ఒకటి. హిందూపూర్‌, రెండోది కేన్సర్‌ ఆసపత్రి మాత్రమే మాట్లాడుతుంటారు. బాలయ్య బాబుకు ఫ్యాన్స్‌కు ఎంతో అనుబంధం ఉంటుందన్నారు.. సినిమా చేయటం ఎంతో ఆనందంగా ఉంది.. బాలయ్య ఎపుడు పిలిస్తే అపుడు మళ్లీ రావాలన్పిస్తోందని అన్నారు..
అనూప్‌మంచి సంగీతం ఇచ్చారు. చాలా ఆనందంగా ఉందన్నారు.. భవ్య క్రియేషన్స్‌ అధినేత ఆనంద్‌ ప్రసాద్‌ బ్యానర్‌లోపనిచేయటం ప్రథమం అన్నారు.. శ్రియ శరణ్‌. కైరతా.చార్మి అందంగా నటించారని అన్నారు.. ఖమ్మంనుఎప్పడూ మర్చిపోలేనని అన్నారు. పైసా వసూల్‌ పెద్దహిట్‌ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. చివరగా కోకోకోలా పెప్సీ, బాలయ్యబాబు సెక్సీ..అంటూ పూరీ తన ప్రసంగాన్ని ముగించారు. మోహనకృష్ణ, అంబికా కృష్ణ, కెమేరా మెన్‌ ముఖేష్‌ తదితరులు మాట్లాడారు.. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, సినిమాఅనేది పార్టీలకు, అభిమానులకు అతీతం, ఆడియో వేడుక అనేది సరిగమపదనిస, సమ్మేళనమని, మంచి సాహిత్యం, మధురగీతాలను వినటానికి భాషాబేధం, పండిత పామరుల పట్టువిడుపులు ఉండవని తన నమ్మకం అన్నారు.
ఆదినుంచి సంగీతంకు మంచి స్పందన ఉందన్నారు. సాంగ్స్‌ హిట్‌అయ్యిందనే సినిమా సగం హిట్టయిందనే భావించాలన్నారు.. సాహిత్యంతో కనెక్ట్‌ అయ్యానని, అందుకే ఆ పాట పాడటం జరిగిందన్నారు.. భాస్కరభట్ల మంచి సాహిత్యం అందించారని అందుకే నేనుపాడగలిగానని అన్నారు.. మ్యూజిక్‌ దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ సంగీతానికే ఒక మాధుర్యం తీసుకొచ్చారు. 5 పాటలకుమణిపూసల్లాంటి బాణీలు సమకూర్చారు.. నా సినిమాకు ప్రతిసినిమా చేసిన మ్యూజిక్‌ డైరెక్టర్లు అందరూ తన అభిమానుల టేస్టును దృష్టిలో ఉంచుకుని సంగీతాన్నిఅ ందిస్తారని తెలిపారు. తనను ఎవరైనా మీరెవరూ అని అడిగితే. నేను భారతీయుడని, తెలుగువాడిని, నందమూరి రామారావు కొడుకునని, మళ్లీ మళ్లీ అడిగితే నందమూరి అభిమానినని చెబుతాను.. ఆయన బిడ్డగా మీ ముందుకు రావటం చాలా ఆనందంగా ఉందన్నారు.. ఆయన స్ఫూర్తితో పార్టీకి సేవలందిస్తూ వస్తున్నానని చెప్పానరు. . ఆయన స్ఫూర్తితోనే ఎమ్మెల్యేగా ఉన్నాను.నా తుది రక్తపు బొట్టువరకు హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని అన్నారు..

ఈచిత్రంలో నాటి జీవితచక్రం సినిమాలోని కొంటి చూపు చెబుతోంది.. పాటను రీమీక్స్‌ చేయటం జరిగిందన్నారు.పూరీతో చేయాలని అనుకున్నానని, క్యారెక్టర్‌ క్యార్టెర్‌కు ప్రత్యేక ఉంటుందని నాన్నగారు లవకుశ చేశారు. నేను శ్రీరామచంద్ర చేశాను. గౌతమి బుద్ద శాతకర్ణి కి అన్నగానే స్ఫూర్తి అన్నారు.. సంకల్ప బలం అనేది చాలా ముఖ్యం అనే మనల్ని ముందుకు నడిపిస్తుందన్నారు.. పూరిజగన్నాధ్‌ కథలోని నటీనటుల నుంచి వాళ్ల హావభావాలను చూపించే ప్రతిభ ఆయనలో ఉందన్నారు. తనకు 101గా చిత్రమని, మళ్లీ ఇది మొదటిసినిమా భావిస్తానని అన్నారు.. పైసావసూల్‌ అంటే డబ్బు రాబట్టుకోవటం కాదు.. రీలాంచ్‌గా భావిస్తానని అన్నారు.. వినోదాన్ని వైజ్ఞానాన్ని ప్రేక్షకులకు అందించాలని అన్నారు. యాక్టింగ్‌ అంటే పాత్రల్లో పరకాయ ప్రవేశమని , ఆపాత్రల ప్రభావంపట్ల నటీనటలు జాగ్రత్తగా ఉండాలన్నారు.. 101 రీలాంచింగ్‌ సినిమాగా భావిస్తున్నానని అనానరు..బాలయ్య తన ప్రసంగం ముందు అభిమానులకు అభివాదంచేశారు.. ఈసందర్భంగా ప్రాంగణంలో కేరింతలు కొట్టారు..