రివర్స్‌ బిడ్డింగ్‌తో రూ.10వేల కోట్ల ఆదా!

RAILWAYE
Railways

న్యూఢిల్లీ: రైల్వేలో పెరుగుతున్న పోటీని తట్టుకునినిర్వహణ వ్యయాన్ని సైతం కట్టడిచేసేందుకు ఇకపై కొనుగోళ్లలో రివర్స్‌వేలం ప్రక్రియను చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దీనివల్ల సాలీనా రూ.10వేల కోట్లు ఆదాఅవుతుందని అంచనావేసింది. వచ్చే ఏప్రిల్‌ ఒకటవ తేదీనుంచి రివర్స్‌ బిడ్డింగ్‌ విధానం ఎలక్ట్రానిక్‌ పద్దతిలో అమలుచేస్తున్నది. వ్యాగన్లు, లోకోఎమోటివ్‌లు, కోచ్‌ల విడిభాగాలు, సిగ్నలింగ్‌,ఆక్‌ సామగ్రి, సిమెంట్‌ ఇతరత్రా కీలక సామగ్రిని ఈ విధానంలో సేకరిస్తుంది. వీటితోపాటు పనులు, సేవలు ఇతర ఉత్పత్తి యూనిట్లునుంచి విక్రేతలనున తమకు అనుకూలమైన బహుళ బిడ్‌లను ఒక్కసారిగా దాఖలుచేయాలని, ఆన్‌లైన్‌ బిడ్లను సైతం ప్రోత్సమించేందుకు ఈ విధానం అనుసరిస్తోంది. వీటిలో తక్కువమొత్తం వేసిన బిడ్లకు అనుమతి నిస్తుంది. రైల్వేశాఖ సాలీనా రూ.50వేల కోట్ల విలువైన కొనుగోళ్లు చేస్తుంది. రోలింగ్‌ స్టాక్‌, ప్యాసింజర్‌ గూడ్స్‌ సర్వీసెస్‌, ఇతర భద్రతకు సంబంధించిన పనులపై కూడా ఎక్కువ కొనుగోళ్లుచేస్తోంది. అదనంగా ట్రాక్‌ సప్లయి సామగ్రికి రూ.10వేల కోట్లు ఖర్చుచేస్తోంది. రూ.60వేల కోట్ల విలువైన పనులను విస్తరణ, అప్‌గ్రేడేషన్‌కోసం చేపడుతున్నది. రూ.10కోట్ల విలువయిన సరఫరా టెండర్లు ఎలక్ట్రానిక్‌ రివర్స్‌ వేలం విధానంలో నిర్వహిస్తుంది. అదేవిధంగా అన్ని సేవలు పనులు కూడా రూ.50కోట్లకు మించినవాటిని కూడా ఈ విధానంలోనే అమలుచేస్తుందనిరైల్వేశాఖ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ కొత్తవిధానం వచ్చే ఏప్రిల్‌ ఒకటవ తేదీనుంచే అమలులోనికి వస్తోంది. మొత్తం 70శాతం కొనుగోళ్లు, పనులకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ విధానం అమలుచేస్తోంది. ప్రస్తుతం అనేక మంత్రిత్వశాఖలు అంటే విద్యుత్‌,ర్పభుత్వరంగసంస్థలు వంటివి రివర్స్‌ వేలం విధానంతో గిట్టుబాటుధరలకే కొనుగోళ్లు చేస్తున్నాయి. రివర్స్‌ బిడ్డింగ్‌కోసం కేంద్రం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సైతం రూపించింది. రైల్వేశాఖ సాంకేతిక విభాగం క్రిస్‌ ఈనెలాఖరుకేఈ వ్యవస్థను సిద్ధంచేస్తున్నది. కాగితరహిత లావాదేవీలతోను,మధ్యవర్తులు,దళారుల ప్రమేయం లేకుండా జరిగే విధానం కావడం వల్ల బిజినెస్‌ సానుకూలత మరింతపెరుగుతుందని అంచనా. అవినీతిని సైతం తగ్గిస్తుంది. అంతేకాకుండా ఉత్పత్తి నిర్వహణ, కొనుగోళ్ల వ్యయాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలని, పదిశాతం పొదుపు జరిగినా మొత్తంగాచూస్తే సాలీనా రూ.10వేల కోట్లకు చేరుతుందని రైల్వే అధికారులు చెపుతున్నారు. ఎలాంటి రుసుంలేకుండా రివర్స్‌వేలం టెండర్‌ దాఖలుచేయవచ్చని, దీనితో ఎక్కువ విలువలున్న ఉత్పత్తుల కొనుగోళ్ల విధానం మొత్తం డిజిటైజ్‌ చేయడం, పారదర్శకంగా అమలుచేసినట్లవుతుందని రైల్వే భావిస్తోంది.