రిలయన్స్‌ నికరలాభం రూ.10,251కోట్లు

RELIANCE
RELIANCE

ముంబయి: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మూడోత్రైమాసికం నికరలాభాలు తొమ్మిదిశాతంపెరిగాయి. ముకేష్‌ అంబాని ఆధ్వర్యంలోని రిల్‌ మూడోత్రైమాసికంలో 10,251కోట్ల నికరలాభం ఆర్జించింది. గత ఏడాది ఇదేకాలంలో 9420 కోట్లు ఆర్జించిన కంపెనీ తొమ్మిదిశాతం లాభాలను పెంచుకోగలిగింది. మార్కెట్‌నిపుణులు అంచనాలనుచూస్తే 9648 కోట్లు ఉంటుందని వేసిన అంచనాలు తల్లకిందులయ్యాయి. ఈ ఏడాది మూడోత్రైమాసికంలో మొట్టమొదటి కంపెనీగా పదివేలకోట్ల లాభాలు దాటిన కంపెనీగా రిలయన్స్‌ నిలిచింది. పెట్రోకెమికల్స్‌యూనిట్‌ ఎక్కువగా రాబడులను లాభాలను పెంచుతున్నది. రాబడులపరంగా 467శాతంపెరిగాయి. లాభాలుకూడా 37శాతంపెరుగుతున్నట్లు అంచనావేసింది. రిలయన్స్‌మొత్తం కార్యకలాపాలద్వారా రాబడులు 56శాతంపెరిగి రూ.1,62,759 కోట్లకు చేరింది. కంపెనీ టెలికాం విబాగం రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ 65శాతం లాభాలుపకరిగి రూ.831కోట్లకు చేరింది. జియో వరుసగా ఐదో త్రైమాసికంలో కూడా నికరలాభాలు పెంచుకోగలిగింది.జియో నికర నిర్వహణ రాబడులు 50.9శాతంపెరిగి రూ.10,383 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో జియోకు 6879 క ఓట్లు రాబడులు వచ్చాయి. గడచిన రెండేళ్లలో జియో డేటా ఛార్జిలను తగ్గించింది. ఉచిత వాయిస్‌కాల్స్‌ను పెంచింది. 250 మిలియన్‌ చందాదారులున్నట్లుప్రకటించింది. కంపెనీ ఫలితాలపై రిలయన్స్‌ సిఎండి ముకేష్‌ అంబాని మాట్లాడుతూ ఇదంతా సమిష్టి కృషిఫలితమేనని మొట్టమొదటిసారిగా భారతీయ ప్రైవేటురంగంలో పదివేల కోట్లకుపైబడిన నికరలాభం ఆర్జించిన ఘనత రిలయన్స్‌దే కావడం విశేషం.