రిలయన్స్‌జియో నుంచి జియోఫైబర్‌

jio
jio

రిలయన్స్‌జియో నుంచి జియోఫైబర్‌

ముంబయి, మే 31: ఇతర టెలికాం కంపెనీలకు దీటుగా రిలయన్స్‌జియో కొత్తబ్రాండ్‌ బ్యాండ్‌ పథకం అమలుకు తెస్తోంది. నెలకు రూ.500 ఛార్జీతో 100 జిబి డేటాను అందించేందుకు జియోఫైబర్‌ను అక్టో బరు నుంచి ప్రారంభిస్తోంది. ఇతర అనేక ఆఫర్లతోపాటు జియోఫైబర్‌ సేవలు 100 ఎంబిపిఎస్‌ వేగం తో ఉంటాయని అంచనా. బ్యాండ్‌విడ్త్‌పరంగానేమి జియోఫైబర్‌ వేగాన్ని ఇతర కంపెనీలన్నింటికంటే వేగంగా ఇస్తుందని చెపుతోంది. రిలయన్స్‌ జియోఫైబర్‌బ్రాడ్‌బ్యాండ్‌సేవలు ప్రివ్యూ ఆఫర్‌తో వస్తాయి. జియోసేవలు ప్రారంభించిన తరహాలోనే ఇవికూడా అమలవుతాయి. జియోఫైబర్‌ సేవలకు 90రోజుల పరిమితి ఉంటుంది. ఉచితఆఫర్‌ కింద జియో ఫైబర్‌బ్రాడ్‌బ్యాండ్‌సేవలు 100ఎంబిపిఎస్‌వేగంతో ఇస్తుం ది.

అలాగే నెలవారీగా 100 జిబి డేటాను అందిస్తుంది. అలాగే అన్ని జియోప్రీమియం అప్లికేషన్లకు చేరువ అవుతుంది. విని యోగదారులు 100 జిబిడేటా పరిమితి తర్వాత ఒక ఎంబిపిఎస్‌ వేగానికి పడిపోతుంది. ఈ సేవలు ఉచితంగానే 90రోజులపాటు ఇస్తున్నా జియో తదనంతరం వన్‌టైమ్‌ రిఫండబుల్‌ ఇన్‌స్టా లేషన్‌ ఛార్జీలు రూ.4500 వరకూ వసూలుచేస్తుంది. జియో ఫైబర్‌ వద్దనుకున్నపుడు ఈ మొత్తం వాపసు ఇస్తుంది. భారతి ఎయిర్‌టెల్‌ కూడా ఇటీవలే తన ప్లాన్‌లను ఆధునీకరించింది. వందశాతం అదనపు డేటాను ప్రతిప్లాన్‌పై ఇస్తోంది. కొత్తప్లాన్‌లపరంగా 60జిబి హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ డేటా రూ.899కి ఇస్తోంది. 30జిబి అంతకుముందు పరిమితి ఉండేది. 1099 ప్లాన్‌లో 50జిబికి మించి 90జిబికి డేటా ఇస్తుంది.

1299 ప్లాన్‌ ఆఫర్లలో 125 జిబి ఇస్తుంది. ప్రీమియం 1499 ప్లాన్‌లో 160జిబి వరకూ డేటా ఇస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లు ఢిల్లీ ఎన్‌సిఆర్‌ రీజియన్‌లో 1000 జిబి డేటా ఎంపికచేసిన ప్లాన్‌లపై అదనంగా ఇస్తామని ప్రకటించింది. ఈలోపు జియో ప్రకటించిన ఫైబర్‌ సేవలు మరింత వేగంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.