రిలయన్స్‌ఎఎంసి ఐపిఒ

IPO
IPO

రిలయన్స్‌ఎఎంసి ఐపిఒ

న్యూఢిల్లీ, ఆగస్టు 21: అనిల్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌ గ్రూప్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ తాజా గా ఐపిఒ జారీకోసం దరఖాస్తుచేసింది. కంపెనీ విలువలు రూ.18వేల కోట్లుగా పేర్కొన్నది. భారత్‌లో ఒక భారీ అసెట్‌మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఐపిఒకు వస్తుండటం ఇదే మొదటిసారి. యుటిఐ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఐపిఒ ప్రణాళికలకంటే తక్కువ అయినప్పటికీ దీర్ఘకాలం పాటు పనిచేస్తుందని అంచనా. 2008లో రిలయన్స్‌ పవర్‌ తర్వాత రిలయన్స్‌గ్రూప్‌నుంచి వస్తున్న మొట్టమొదటి ఐపిఒగా పేర్కొనవచ్చు. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌మేనేజ్‌మెంట్‌ కంపెనీ తాజా ఇష్యూలో 2,44,80,000 ఈక్విటీ వాటాలను 1,12,30,200 షేర్ల ను ఆఫర్‌ఫర్‌సేల్‌ రూటులోను విక్రయిస్తోంది. రిలయన్స్‌ కేపిటల్‌ నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కంపెనీ రెండూకలిసిన సంస్థగా మొత్తం 2,54,89,800 షేర్లను ఐపిఒద్వారా జారీ చేసేందుకు సెబి వద్ద ముసాయిదా పేపర్లను దాఖలుచేసింది. ఐపిఒ పరిమాణంచూస్తే మొత్తం అధీకృత మూలధనంలో పదిశాతంగా ఉంటుందని రిలయన్స్‌నిప్పన్‌ అసెట్‌మేనేజ్‌ మెంట్‌ కంపెనీ చెపుతోంది. ఐపిఒద్వారా వచ్చిన నిధులను కంపెనీ అవసరాలకు వినియోగిస్తుంది.

జపాన్‌కు చెందిన నిప్పన్‌లైఫ్‌, రిలయన్స్‌ కేపిటల్‌ అసెట్‌ మేనేజర్‌గా ఈ రిలయన్స్‌మ్యూచువల్‌ఫండ్‌కు వ్యవహరిస్తోంది. 11.42శాతం మార్కెట్‌ వాటాతో ఉంది. 3.6 లక్షలకోట్ల నిర్వహణ ఆస్తులున్నాయి. రూ.2.23 లక్షలకోట్లవరకూ మూచువల్‌ఫండ్స్‌ను నిర్వహి స్తోంది. కంపెనీ జెఎం ఫైనాన్షియల్‌, సిఎల్‌ఎస్‌ఎ, నోమురా, యాక్సిస్‌కేపిటల్‌ సంస్థలను గ్లోబల్‌ సమ న్వయకులుగాను, బుక్‌ రన్నింగ్‌ లీడ్‌మేనేజర్లుగాను నియమించుకుంది. జూన్‌నెలలో ఆర్‌ఎన్‌ఎఎం బోర్డు స్టాక్‌ఎక్ఛేంజిల్లో జాబితాచేసేందుకుగాను ఆమోదం తెలిపింది. సంస్థ సిఇఒ సందీప్‌ సిక్కా మాట్లాడుతూ ప్రాథమికంగా కంపెనీ పదిశాతం వాటాలను మార్చినాటికి జారీచేస్తుందని, మరో 15శాతం వచ్చే మూడేళ్లలో ఐపిఒలు జారీచేస్తుందని, సెబి నిబంధనలకు అనుగుణంగా అందుతుందని వెల్లడించింది.