రియలిస్టిక్‌ స్టోరీస్‌ ఉండాలనుకుంటా: నాగచైతన్య

NAGACAHITANYA2
NAGACAHITANYA

రియలిస్టిక్‌ స్టోరీస్‌ ఉండాలనుకుంటా: నాగచైతన్య

ఇటీవల ప్రేమమ్‌ చిత్రంతో సక్సెస్‌ అందుకున్న అక్కినేని నాగ చైతన్య నటించిన మరొక చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా.. హీరో నాగచైతన్య విలేకర్లతో ముచ్చటించారు.

ప్రేమమ్‌ కు ముందు రావాల్సిన సినిమా..

సినిమాను గతేడాది డిసెంబర్‌లో విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ రెండు లాంగ్వేజస్‌లో షూటింగ్‌ చేయడం కారణం ఒకటైతే, మంచి రిలీజ్‌ డేట్‌ కోసం వెయిట్‌ చేయడం వల్ల సినిమా ఇంత ఆలస్యమైంది. అయితే ఆలస్యమైందని ఏ టెన్షన్‌ లేదు. ప్రేమమ్‌ కంటే ముందుగానే సాహసం శ్వాసగా సాగిపో సినిమా రిలీజ్‌ కావాల్సింది. కానీ ప్రేమమ్‌ తర్వాత రిలీజైంది. రెండు డిఫరెంట్‌ జోనర్స్‌ కు చెందిన సినిమాలు. ఒకే సంవత్సరంలో రెండు డిఫరెంట్‌ సినిమాలు రిలీజ్‌ అవ్వడం నటుడిగా సంతోషాన్నిస్తుంది.

నమ్మకం ఇంకా పెరిగింది..
లవ్‌స్టోరీస్‌ నాకు కంఫర్ట్‌ జోన్‌ మూవీస్‌. ప్రేమమ్‌ తర్వాత ఆ కాన్ఫిడెన్స్‌ ఇంకా పెరిగింది. ఇంకా డిఫరెంట్‌ లవ్‌ స్టోరీస్‌ ట్రై చేస్తే ఆడియెన్స్‌ యాక్సెప్ట్‌ చేస్తారని తెలిసింది.

ఏ మాయ చేసావేకు ఎక్స్‌టెన్షన్‌గా ఉంటుంది..
ప్రేమమ్‌ సినిమాలో ఒక వ్యక్తి ఏజ్‌ గ్యాప్‌లో జరిగే మూడు లవ్‌స్టోరీస్‌ కాంబినేషన్‌. ఇక సాహసం శ్వాసగా సాగిపో అనే ఓ కుర్రాడు రెండు వేర్వేరు పరిస్థితుల్లో ఎలా ఉంటాడోనని చూపిస్తుంది. ఫస్టాఫ్‌ అంతా ఏ మాయ చేసావే సినిమాకు ఎక్స్‌టెన్షన్‌గా కనపడుతుంది. ఇక సెకండాఫ్‌ ఘర్షణ స్టయిల్లో సస్పెన్స్‌ థ్రిల్లింగ్‌గా సాగుతుంది.

అందుకే టైటిల్‌ పెట్టాం..
కుర్రాడు తను ప్రేమించిన అమ్మాయికి ఓ సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య నుండి ఆ అమ్మాయిని కాపాడటానికి ఎలాంటి సాహసం చేశాడనేదే కథ. అందువల్లే ఈ సినిమాకు సాహసం శ్వాసగా సాగిపో అనే టైటిల్‌ పెట్టారు.

స్టోరీస్‌ రియలిస్టిక్‌ గా ఉండాలనుకుంటా..
మొదట్లో యాక్షన్‌ సినిమాలు చేసినా.. సినిమాల wస్కిప్ట్స్‌ సెలక్షన్‌ చేసేంత మెచ్యురిటీ రాలేదేమో అందుకే అనుకున్నంత హిట్‌ కాలేకపోయాయి. అయితే ఇప్పుడు నటుడుగా కొంత నేర్చుకున్నాను. అలాగే గౌతమ్‌గారు ఆయన సినిమాలో క్యారెక్టర్స్‌ను కన్విన్సింగ్‌గా చూపిస్తారు. కాబట్టి కాన్ఫిడెంట్‌గా ఒప్పుకున్నాను. నేను చేసే సినిమాల్లో రియలిస్టిక్‌ స్టోరీస్‌ ఉండాలని కోరుకుంటాను.

యాక్షన్‌ జోనర్‌ లో యాక్సెప్ట్‌ చేస్తారు..
దర్శకుడు గౌతమ్‌మీనన్‌ ప్రతి క్యారెక్టర్‌ను చాలా బాగా డిజైన్‌ చేస్తారు. ఇందులో క్యారెక్టర్స్‌ను చూస్తున్నప్పుడు ఆడియెన్స్‌ క్యారెక్టర్‌తో పాటు ట్రావెల్‌ చేస్తారు కాబట్టి, ఫస్టాఫ్‌ లవ్‌ స్టోరీ, సెకండాఫ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఉంటుంది కాబట్టి అందరూ కనెక్ట్‌ అవుతారు. ఏమాయ చేసావె తర్వాత ఆడియెన్స్‌ నన్ను లవ్‌స్టోరీస్‌లో యాక్సెప్ట్‌ చేశారు. ఈ సినిమా తర్వాత ఆడియెన్స్‌ నన్ను యాక్షన్‌ జోనర్‌ సినిమాలకు కూడా యాక్సెప్ట్‌ చేస్తారు. అలా కొత్తగా ప్రెజెంట్‌ చేశారు.

వచ్చే ఏడాది కచ్చితంగా చేస్తా..
సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా చేయాలనుకున్నాను. అయితే తమిళంలో షూటింగ్‌ ముందుగానే స్టార్టయ్యింది. అందువల్ల గౌతమ్‌గారి నెక్ట్స్‌ మూవీలో తెలుగు, తమిళంలో నేనే చేస్తానని రిక్వెస్ట్‌ చేశాను. తమిళ హీరోలు ఇక్కడ ట్రై చేస్తున్నట్లే మనం కూడా తమిళంలో సినిమాలు చేయాలి. వచ్చే ఏడాది కచ్చితంగా చేస్తాను.

అఖిల్‌ పెళ్లి రోమ్‌ లో..
అఖిల్‌ పెళ్లి రోమ్‌ లో జరగనుంది.. ముందుగా డిసెంబర్‌ 9న అఖిల్‌-శ్రియా భూపాల్‌ ల నిశ్చితార్థం జరిపి.. మే నెలలో పెళ్లి చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఆ తరువాతే నా పెళ్లి ఉంటుంది.
తదుపరి చిత్రాలు.. కల్యాణ్‌ కష్ణ దర్శకత్వంలో సినిమా బుధవారం నుండి స్టార్ట్‌ అవుతుంది. నిన్నే పెళ్లాడతా తరహాలో ఉంటే లవ్‌ ఎంటర్‌టైనింగ్‌ జోనర్‌. ఈ సినిమాకు టైటిల్‌ ఏమీ అనుకోలేదు. మరో సినిమాను కష్ణ దర్శకత్వంలో జెంటిల్‌మేన్‌ స్టోరీ రైటర్‌ డేవిడ్‌ నాథన్‌ అందించిన కథతో తెరకెక్కిస్తున్నాం.