రిటైర్ అవుతానని స్పష్టం చేసిన కెప్టెన్ సునీల్ ఛేత్రి

SUNIL CHETRI
ఆసియా కప్‌-2019 టోర్నమెంట్ నుంచి భారత్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. సోమవారం బెహ్రైన్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-1 తేడాతో ఓటమిపాలైన భారత్ జట్టు.. థాయ్‌లాండ్‌తో యూఏఈకి మధ్య జరిగిన మ్యాచ్‌ 1-1 తేడాతో డ్రాగా ముగియడంతో టోర్నమెంట్ నుంచి తప్పుకోక తప్పలేదు.ఈ సందర్భంగా కెప్టెన్ సునీల్ ఛేత్రి ఇక రిటైర్‌మెంట్ ప్రకటించాలంటూ.. కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రశ్నలకు ఛేత్రి సమాధానం ఇచ్చారు. నెం.10 జెర్సీలో తన స్థానాన్ని భర్తీ చేసే వాళ్లు వచ్చినప్పుడు రిటైర్ అవుతానని సునీల్ స్పష్టం చేశారు. ‘‘రిటైర్ అయ్యే అలోచన లేదు. ఒక రోజు నెం.10లో నాకంటే మంచిగా ఆడే ప్లేయర్ వస్తాడు. నేను ఇంకా.. జట్టుకి సేవ చేసే అవకాశం ఉంది’’ అని ఆయన స్పష్టం చేశారు.