రిటర్న్‌లు దాఖలులో ఇబ్బందులు

ప్రజావాక్కు
                    రిటర్న్‌లు దాఖలులో ఇబ్బందులు

GST RETURNS
GST RETURNS

రిటర్న్‌లు దాఖలులో ఇబ్బందులు
జి.ఎస్‌.టి పన్నుల విధానం అమలు చేసి ఏడాది పూర్తయ్యిం ది.ఈ ఏడాది పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగి ఆర్థిక సం క్షోభం నుండి దేశం గట్టెక్కింది. అయితే ఈ విషయంలో ప్రభు త్వం చేయాల్సింది ఇంకాఎంతో ఉంది. ముఖ్యంగా చాలా రిట ర్నులు దాఖలుచేయాల్సి రావడం, ఒక్కొక్కరిటర్న్‌కు ఒక్కొ క్క గడువ్ఞ తేదీ ఉండడం వలన వ్యాపారులు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ఒక్కటే రిటర్న్‌ను దాఖలు చేసేందుకు వీలు కల్పించాలి. రిటర్న్‌ దాఖలు చేసిన తర్వాత ఏమైనా పొరబాట్లు కలిగినట్లు గుర్తిస్తే పొరపాట్లను సరిదిద్దేవిషయంలో వ్యాపారు లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్ఞతున్నాయి.తరచుగా జి.యస్‌. టి సర్వర్లు స్తంభించి పోతున్నాయి. వినియోగదారుల సమస్య లను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

పేదరికాన్ని నిర్మూలించాలి
తెలంగాణ రాష్ట్రంలో పల్లెల్లో 35 శాతం, పట్టణాలలో 16 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయని 11 శాతం మంది 15-19 సంవత్సరాల మధ్య గర్భం దాల్చుతున్న కారణంగా వారికి నవజాత శిశువ్ఞలకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తు తున్నాయన్న కేంద్ర ఆర్థిక సామాజిక అధ్యయన కేంద్రం అధ్య యన నివేదిక పట్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తక్షణం స్పం దించాలి. రాష్ట్రంలో పేదరికం బాలికలకు శాపంగా పరిణమి స్తోంది. నిరుపేద కుటుంబాలలో అత్యాధికులు తమ పిల్లలకు చిన్నతనంలోనే పెళ్లి చేసి, తలమీద నుండి బరువ్ఞను దించేసు కోడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికంతటికి కారణం పేదరికం. పేదరికాన్ని నిర్మూలించాలి.
-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

ఎన్నికల విధానాన్ని ప్రక్షాళన చేయాలి
ఇటీవలి కొన్ని రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో ధనం, మద్యం ఏరులై ప్రవహించింది. కుల,మత,వర్గ, ప్రాంతాలకు అనుగు ణంగా రాజకీయ పార్టీలు ఎన్నో ఎత్తుగడలు వేసాయి. కాలేజీ విద్యార్థులకు ఉచితలాప్‌టాప్‌లు,స్మార్ట్‌ఫోన్లు, మిక్సర్లు, గ్రాండ ర్లు, ఒకగ్రామ్‌ నగలు వంటి వాగ్దానాలను ఇష్టం వచ్చినట్లుగా చేసాయి. ఈ తరహా ఉచిత చౌకబారు హామీల వరద సొమ్ము ప్రజలది సోకు పార్టీలది అన్న చందంగా ఉంది. ప్రభుత్వానికి ఎన్నికల విధానాన్ని ప్రక్షాళనం చేయడంలో ఎలాంటి చిత్తశుద్ధి లేదని అర్థమవ్ఞతోంది.
-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరు

ప్రలోభాలకు లొంగవద్దు
ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులు వాళ్లను ప్రలోభాల మాయలో పడేయడం మామూలైంది. ఎక్క డి నుండి వస్తాయో ఏమో ఎన్నికల ముందు డబ్బులు పంచ డం, ఇతర వాటిని ఉచితంగా ఇవ్వడం చేస్తారు. ప్రజాసంక్షేమా నికి ఖర్చు చేయాల్సిన నిధులన్నీ ప్రజలకు ఉచితంగా ఎన్నికల ముందు వాగ్దానాలు ప్రకటించి వాటిలో కొన్నింటిని అమలు చేస్తారు. అందుకే ప్రలోభాలకు లొంగవద్దు. నిజాయితీపరులైన నాయకులకు ఓటేసిగెలిపించాలి.అప్పుడే మనం బాగుపడతాం.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

రాజకీయ నాయకుల్లో మార్పు అవసరం
అన్ని పార్టీల వారు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఎవ ర్ని పడితే వారిని పార్టీల్లో చేర్చుకుంటున్నారు. పదవ్ఞలను కట్టబెడుతున్నారు.పాతస్నేహాలను వదులుకుంటున్నారు. అధికా రం కోసం అవినీతి ముద్రపడిన వారితో చేతులు కలపడానికి సిద్ధపడుతున్నారు. వీరిలో మార్పు రావాలి.
-ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

కేంద్రం ప్రజల సమస్యలు పట్టించుకోవాలి
విమానాలు ఎక్కడం, దిగడంతో ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి సమయం చాలటం లేదు. పైగా విదేశాలలో తిరుగుతున్నంత సేపులక్షలకోట్ల పెట్టుబడులు వస్తున్నాయని వేలల్లో ఉద్యోగాలు వస్తాయని ప్రజలను మభ్యపెట్టడంతో కాలం గడుపుతున్నారు. వాస్తవంగా ప్రాజెక్టు పరిశ్రమ ఇంతవరకు వచ్చిన దాఖలాలు లేవ్ఞ. దేశంలో నిరుద్యోగ సమస్యల తాండవిస్తుంటే ఆ సమస్యే అసలు లేదనట్లు మిన్నకుండటం నిజంగా క్షమించారని నేరం. తరచూ గత పాలకులు చేసిన ప్రగతి ఏమీలేదు అని అంటుం టారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏమీ చేసింది. ఒక్కసారి ఆలోచించాలి.
-సి.వి.ఆర్‌.కృష్ణ, హైదరాబాద్‌

ధరలను అదుపు చేయాలి
పెట్రోలు, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతుండడం వలన సామాన్యుల పరిస్థితి నేడు దయనీయంగా మారింది. ముఖ్యం గా గత నాలుగునెలలుగా వీటి ధరలు బాగాపెరిగినా కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేక చేతుతెత్తేసింది. అంతర్జాతీయ మార్కె ట్‌లో ముడిచమురు ధరలు తగ్గినప్పుడు పెట్రోలియం ఉత్ప త్తుల ధరలను తగ్గించని చమురు కంపెనీలు కోట్లాది రూపా యల లాభాలను సంపాదించి, ధరలు పెరిగినప్పుడు మాత్రం వాటిని ప్రజలపై మోపుతున్నాయి.
-ఆర్‌.రవిప్రకాశ్‌, నల్గొండ