రిజర్వుబ్యాంకు నిర్వాకమే!

RBI1
RBI1

రిజర్వుబ్యాంకు నిర్వాకమే!

అవినీతి, అభివృద్ధి కలిసి పయనించలేవ్ఞ. అవినీతి పెరిగే కొద్దీ అభివృద్ధికి తూట్లు పడకతప్పదు.అభివృద్ధి ముందుకు నడిచేకొద్దీ అవినీతి వెనక్కి గుంజుతూ ఉంటుంది. కానీ అభివృద్ధి ఎక్కడ ఉంటుందో అక్కడే అవినీతి కూడా ఏదో ఒక రూ పంలో ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథ కాలు చేపట్టి నిధులు వెచ్చించకపోతే అసలు అవినీతి తలెత్తేప్రసక్తి ఉండదేమో. కానీ మనది సంక్షేమ ప్రభుత్వం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీదనే ప్రభుత్వాల మనుగడ ఆధారపడిఉంటుంది.

ఏపార్టీ అధికారంలో ఉన్నా, అటు కేంద్రంలోకానీ ఇటు రాష్ట్రాల్లో కానీ పాలకులకు మన సులో ఎలాఉన్నా ఈ కార్యక్రమాలు చేపట్టాల్సిందే. ఇటు తెలుగు రాష్ట్రాల్లోఅటు కేంద్రంలో కూడా పెద్దఎత్తున దేశ వ్యాప్తంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి లక్షలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. అదేస్థాయిలో అవకతవ కలు, అవినీతి కూడా పెరిగిపోతున్నది. ప్రజల సొమ్ముకు కాపలాదారులమని పదేపదే చెప్పుకునే పాల కులు అవినీతిని నిరోధించడంలో విఫలమవ్ఞతున్నారు. ఒకనాడు అత్యంత గౌరవప్రదంగా ఉన్న బ్యాంకింగ్‌ వ్యవస్థ కూడా నేడుఅవినీతి,ఆశ్రితపక్షపాతం,మరొకమాటలో చెప్పా లంటే దోపిడీకి గురై లక్ష్యానికి దూరమై ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడిందేమోననిపిస్తున్నది. బ్యాంకులపై గతం లోఉన్న నమ్మక, విశ్వాసాలు నేడు సన్నగిల్లాయి. ఒకటి, రెండు కాదు. వేలాది కోట్లు దోచుకుపోతున్నారు. అవినీతిని అడ్డుకునేందుకు అవకతవకలను అరికట్టిప్రజాధనాన్ని కాపా డేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నా యి. రాష్ట్రాల్లో అవినీతి నిరోధక శాఖ, కేంద్రంలో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సిబిఐ) లాంటి సంస్థలు నిరంత రం ప్రజాధనాన్ని కాపాడేదాంట్లో నిమగ్నమై ఉన్నాయి. ఎంతో మందిపై కేసులు పెట్టారు. అరెస్టు చేశారు. జైళ్లకు పంపించారు. ఆస్తులు రికవరీ చేశారు.

ఇలాంటి చర్యలు ఎన్నో తీసుకున్నారు. అవినీతిని సహించేది లేదని ఉక్కపా దంతో అణచివేస్తామని, ఇటురాష్ట్ర, అటు కేంద్ర పాలకులు పదేపదే హెచ్చరిస్తున్నారు.ప్రకటనలమీద ప్రకటనలు గుప్పి స్తున్నారు. అయినా ఇవేమి ఈ అవినీతిని ఆపలేకుండా పోతున్నాయి.గతంలోని యుపిఏప్రభుత్వం కుంభకోణాలకు కొదవ లేదని విమర్శలు ఎదుర్కొని అధికారాన్ని కోల్పో వడానికి అవినీతి కూడా ప్రధాన కారణంగా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఎన్‌డిఏ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తున్నదేమోననిపిస్తున్నది. బ్యాంకుల లూటీకి రిజర్వుబ్యాంకులోని కొందరు అధికారులు లోపాయికారిగా చేయి కలుపుతున్నారనేది కాదనలేని వాస్తవం. ఇప్పుడు తాజాగా జరిగిన పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు కుంభకోణం ఒక్కరోజులో ఆరంభం కాలేదు.గత ఐదారు ఏళ్లుగా జరుగు తున్నట్టు చెప్తున్నారు.

ఇప్పటి వరకు అందిన దర్యాప్తులో పదహారువేల కోట్ల రూపాయలకుపైగా దోచుకొనిపోయారు. అలాగే అంతకుముందు మరొక ప్రముఖ పారిశ్రామికవేత్త విజయమాల్యా ఆరువేల కోట్లకుపైగా బ్యాంకులను ముం చారు.ఇప్పుడు కొత్తగా రొటామాక్‌ కంపెనీ ప్రమోటర్‌ విక్ర మ్‌ కొఠారీ మూడువేల ఆరువందల తొంభైఐదు కోట్ల వరకు బ్యాంకులను మోసం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. ఇలా బ్యాంకులను మోసం చేయడం ఇప్పుడేకాదు గత రెండుమూడు దశాబ్దాలుగా జరుగుతున్నది.ఇప్పుడు మరిం త ఉధృతం అయింది. ఇందుకు కారణాలు,కారకుల గురిం చి ఆలోచిస్తే ముందుగా తప్పుపట్టాల్సింది నిందించాల్సింది చర్యలు తీసుకోవాల్సింది రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియానే. ఎన్నో నిబంధనలు, చట్టాలు చేస్తున్నారు. పర్యవేక్షణకు అధికారుల మీద అధికారులను నియమిస్తున్నారు. లక్షలాది రూపాయలు ప్రజాధనం జీతభత్యాల రూపంలో చెల్లిస్తు న్నారు. వీరంతా ఏం చేస్తున్నారు.

ఇన్ని వేల కోట్లు లూటీ అవ్ఞతుంటే ఆ దోచుకున్నవారు దేశసరిహద్దులు దాటి వేళ్లెం తవరకు ఎందుకు బయటపెట్టలేకపోతున్నారు. ఈ కుంభ కోణాల్లో వారిపాత్ర కూడా ఉందనే విమర్శలకు జరుగుతు న్న సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. ఇక నిఘా సంస్థలు సిబిఐ. ఒకనాడు సిబిఐ అంటే నేరస్థుల గుండెల్లో నిద్రపోయేది. పెద్దపెద్ద అధికారులు సైతం సిబిఐ కన్ను పడిందంటే తమ పీఠాలు కదిలిపోతాయని కటకటాలపాలు కాకతప్పదనే భయపడి పోయేవారు.ఇప్పుడు ఆ భయభక్తు లు లేవ్ఞ. రాజకీయ అండ ఉంటే సిబిఐ కూడా ఏమి చేయ లేదనేవిశ్వాసం అంతకంతకు పెరిగిపోతున్నది. మరొకపక్క అధికారంలో ఉన్నపార్టీకి సిబిఐ పనిముట్టుగా తయారవ్ఞతు న్నదన్న ఆరోపణలు కూడా పెరిగిపోతున్నాయి. ఎన్నోసార్లు సిబిఐ దర్యాప్తులపై కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం పెదవి విరిచింది. ఇప్పటికైనా ఈ అవినీతి, అవకతవకల విషయంలో పాలక పెద్దలు మనస్సుపెట్టి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. అమెరికా, జర్మనీ లాంటి దేశాల్లో పటిష్టమైన కేసులు పెట్టి గట్టి చర్యలు తీసుకుంటున్నారు.

హంగేరీ, ఇటలీ, దక్షిణకొరియా లాంటి ప్రాంతాల్లో లంచ గొండితనం నిరోధక చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తు న్నారు.చైనాలో అయితే మరో అడుగు ముందుకు వేసి భారీ జరిమానాలతోపాటు కొన్ని సందర్భాల్లో మరణశిక్ష సైతం విధిస్తున్నారు. ఇక బ్రిటన్‌లో 2010లో అమలులోకి వచ్చిన లంచాల నిరోధక చట్టం అవినీతిపై మరింత పక డ్బందీగా నిఘా వేయడమేకాదు చర్యలు కూడా తీసుకుం టున్నది. భారత్‌లో ఆ పరిస్థితి లేదు. ఒకవేళ దేశవ్యాప్తం గాఅవినీతి అంతంచేయగలిగితే స్థూలదేశీయోత్పత్తి మరింత పెరుగుతుందని ఆర్థికరంగ నిపుణులే స్పష్టం చేస్తున్నారు.

అందుకే అవినీతిని, అవకతవకలను పారద్రోలేందుకు రాజ కీయాలకు అతీతంగా అందరు నేతలు నడుం కట్టాలి. అవసరం అయితే ప్రజావేగు సంస్థను ఏర్పాటు చేయాలి. యువతరంలో అవినీతికి వ్యతిరేకంగా చైతన్యం పెంచాలి. అన్నిటికంటే మించి దర్యాప్తు సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా నిరోధించగలిగితే లక్ష్యానికి దగ్గరవ్ఞతాం.

 దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌