రికార్డు నెలకొల్పిన మహేంద్రుడు

DHONI
DHONI

మాంచెస్టర్‌: టీమిండియాలో బ్యాట్స్‌మెన్‌గా, కీపర్‌గా, రెండు ప్రపంచకప్‌లు అందించి రికార్డులు నెలకొల్పిన ధోనీ మంగళవారం రాత్రి ఇంగ్లాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో ఈ రికార్డు సాధించారు. అంతర్జాతీయ టి-20లో అత్యధిక స్టంపింగ్స్‌ చేసిన వికెట్‌ కీపర్‌గా ధోనీ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. 91 టి-20ల్లో 33 స్టంపింగ్‌లతో పాక్‌ కీపర్‌ అక్మల్‌(32) రికార్డును అధిగమించాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక స్టంపింగ్‌ స్కోరు చేసిన ధోనీ తాజాగా టీ-20ల్లో కూడా ఈ రికార్డును చేజిక్కించుకున్నారు.