రా! శ్రీవిళంబి రా!

UGADI-
UGADI-

రా! శ్రీవిళంబి రా!

వసంత ప్రాతఃకాలపు కొత్తకాంతి శోభలలో ఆనవాయితిగ ‘ఉగాది అవనిలో అడుగిడుతున్నది పాత జ్ఞాపకాలు చెదరి కొత్త ఆశ పూస్తున్నది ప్రకృతిలో పరిసరాల సుమ పరిమళ వీచికతో పులకరించి కల కంఠము రవములార బోస్తున్నది శుకపికాల కలధ్వనులు వనసీమలు దాటి-జనా వాస ప్రజానీకమ్మున వీనుల విందగుచున్నది ఆమనిలో కొత్తకొత్త కోర్కెలు చిగురిస్తున్నవి ఆశలంకురాలు మొలచి ఊహలురక లేస్తున్నవి ఆకాశ నక్షత్రమాల హర్షహాస చంద్రికలతో అవని అందచందములను అక్షుల వీక్షిస్తున్నది ఎత్తు పల్లములను దాటి అడ్డంకుల నధికమించి పడిలేస్తూ పయనమ్మై జనం ముందు కొస్తున్నది. – రసస్రవంతి, కావ్యసుధ ఈ ఉగాది…! ఈ ఉగాది! యుగాలకు ఆది ఇది కావాలి మన ఆశల పునాది ఇది చేయాలి గత నిరాశల సమాధి సాక్షిగ నిలవాలి శ్రీవిళంబి ఉగాది కొత్లగ పూచిన మల్లెల ఘమఘమలు ఎదఎదలో పొంగిన మధురిమలు కొమ్మకొమ్మలో కోయిలమ్మ సరిగమలు నవవసంత స్వాగత సంకేతములు ఇంటింట ముంగిట పచ్చతోరణం తెలుగుదన ముట్టిపడుతున్న ప్రాంగణం రచ్చబండవద్ద పంచాంగ శ్రమణం రాశిఫలాలు తెలుసుకుంటున్న జనం తీపి పులుపు వగరు చేదుల ఉగాది పచ్చడి మనకిచ్చె సందేశం కష్టసుఖాల కావడి మసలుకోవాలి మమతానురాగాలు ముడివడి అందరం హాయిగా వ్ఞండాలి అమ్మఒడి ఉగాది! యుగాలకు ఆది ఇది కావాలి మన ఆశల పునాది ఇది చేయాలి గత నిరాశల సమాధి సాక్షిగ నిలవాలి శ్రీవిళంబి ఉగాది! =

 ఎం. రామచంద్రారెడ్డి