రాహుల్ యాత్రలో పాల్గొన్న మెహబూబా ముఫ్తీ

శ్రీనగర్ః కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ కొందరు మహిళలతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. చుర్సు నుంచి కొంతదూరం రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ యాత్రలో తిరిగి పాల్గొనేందుకు ప్రియాంక గాంధీ కూడా శ్రీనగర్ చేరుకున్నారు.
కాగా, జమ్మూ కశ్మీర్ లో కొనసాగుతోన్న రాహుల్ పాదయాత్ర భద్రతా కారణాల దృష్ట్యా శుక్రవారం రద్దయింది. పాదయాత్రలో భాగంగా రాహుల్ బనిహాల్ టన్నెల్ క్రాస్ అవుతుండగా ఆయన్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే జనాన్ని నియంత్రించాల్సిన స్థానిక పోలీసులు అకస్మాతుగా అదృశ్యమయ్యారు. దీంతో జనసముదాయాన్ని నియంత్రించడంలో లోపాలున్నట్లు గుర్తించిన రాహుల్ సెక్యూరిటీ పాదయాత్రను విరమించుకోవాలని సూచించారు. సెక్యూరిటీ సూచనతో రాహుల్ యాత్రను ఆపేసి నైట్ షెల్టర్‌కు వెళ్లిపోయారు. దీంతో కశ్మీర్ లోయలో 11 కిలోమీటర్లు సాగాల్సిన రాహుల్ యాత్ర ఒక కిలోమిటర్కే పరిమితమైంది. శనివారం అవంతిపోరా నుంచి యాత్రను తిరిగి ప్రారంభించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/telangana/