రాహుల్ ప్ర‌ధాని ఐతే ఏపికి ప్ర‌త్యేక హోదాః కుంతియా

kuntia
kuntia

తిరుమ‌లః రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుంతియా అన్నారు. గురువారం ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ… రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కోసం చేసిన చట్టాలను ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. అలాగే ప్రత్యేక హోదా కోసం అన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తున్నా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం బాధాకరమని, రాహుల్ గాంధీ ప్రధాని కాగానే ఆయన ప్రత్యేక హోదాను ప్రకటిస్తారని కుంతియా పేర్కొన్నారు.