రాహుల్ గాంధీతో రఘువీరారెడ్డి బేటీ

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల బృందం ఈ రోజు ఢిల్లీలో భేటీ అయింది. ఏపీ రాజకీయాలపై రాహుల్ గాంధీతో రఘువీరారెడ్డి చర్చించారు. ఇందిరా గాంధీ శతజయంతి ఉత్సవాలను ఏపీలో తాము నిర్వహించిన తీరును రాహుల్ గాంధీకి వివరించిన రఘువీరారెడ్డి.. అదే విధంగా పోలవరం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును, ఈ నెలలో తాము నిర్వహించిన మహా పాదయాత్ర గురించి వివరించారు. విభజన చట్టంలోని హామీల అమలు కోసం పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ పార్టీలు రాష్ట్ర ప్రయోజనలను గాలికి వదలి అసెంబ్లీ సీట్ల పెంపు కచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పడం వెనక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయని ప్రశ్నించారు.