రాహుల్ ప్రధాని అయితేనే ప్రత్యేక హోదా

రాహుల్ ప్రధాని అయితేనే ప్రత్యేక హోదా: రఘువీరా
విజయవాఢ: రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు జరుగుతుందని ఏపిసిసి అధ్యక్షులు డా ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. శనివారం ఆంధ్ర రత్న భవన్లో పత్రికా విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత మూడు రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ ఏఐసిసి కార్యదర్శులు, పిసిసి కార్య వర్గం, కార్యదర్శులు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు, జాయింట్ కార్యదర్శులు, జిల్లా ఇన్చార్జులు, నియోజకవర్గ సమన్వయ కర్తలతో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. జిల్లా అధ్యక్షులు అభ్యర్దుల ఎంపికలో కీలకపాత్ర పోషించేలా రాహుల్‌గాంధీ నిర్ణయించారన్నారు. ఈనెల 7 నుండి 10 వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 5వరకు దరరఖాస్తులను స్వీకరిస్తా మన్నారు. దరఖాస్తు రుసుము ఎమ్మెల్యేకు రు.2వేలు, ఎంపికి రు.5వేలు వుంటుందన్నారు. 10 తర్వాత దరఖాస్తులు స్వీకరించమన్నారు. 175 అసెంబ్లీ, 25 ఎంపి నియోజకవర్గాల ఇన్ చార్జిలతోపాటు జిల్లా, నగర అధ్యక్షులతో మాట్లా డామన్నారు. ఎంపిక చేసిన మండలాల్లో 10 మందిని శక్తి ప్రాజెక్టులో నమోదు చేయించా లన్నారు. ఈనెల రెండోవారంలో ప్రత్యేకహోదా భరోసా ప్రజాయాత్ర ప్రారంభం కానుందన్నారు. ఆశావ హులంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వారి పనితీరు, గతంలో వారు పార్టీకి అందించిన సేవల ఆధారంగా ఎంపికలుంటాయన్నారు.