రాహుల్‌పై జగన్‌ మండిపాటు

Jagan
Jagan

కాకినాడ: ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎందుకు డిమాండ్‌ చేయాలేదని వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ ప్రశ్నించారు. నిన్న లోక్‌సభలో జరిగిన పరిణామాలపై జగన్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌ ప్రస్తావనలో ఏపి అంశాలపై అర నిమిషం కూడా మాట్లాడలేదని విమర్శించారు. రాష్ట్రంపైన ఢిల్లీ పెద్దలకున్న ప్రేమను చూస్తే బాధగా ఉందని జగన్‌ అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని, ఇవ్వాల్సిన బాధ్యత తమదే అనే మాట ప్రధాని నోటి నుంచి రాలేదని మండిపడ్డారు. లోక్‌సభలో టిడిపి ఎంపీలు లేవనెత్తిన అంశాలు గత నాలుగేళ్లుగా తాము చెబుతున్న మాటలు కాదా అని జగన్‌ ప్రశ్నించారు.