రాహుల్‌కి సొంత అభిప్రాయం లేదు

SmrutiIrani
SmrutiIrani

కోల్‌కత్తా: ప్రధాని పదవిపై కలలు కనేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహల్‌ గాంధీ ట్యూషన్‌ తీసుకుంటున్నారని కేంమ్రంత్రి స్మృతి ఇరాని విమర్శించారు. కలలు కనేందుకు రాహుల్‌ ట్యూషన్‌ తీసుకుంటున్నారని ,రాహుల్‌ తన సొంత మాటల కంటే పక్కన వాళ్లు చెప్పేదాన్నే ఎక్కువగా విశ్వసిస్తారని వైరల్‌ అవుతున్న వీడియా ద్వారా రుజువైంది. తనకు ఒక సొంత అభిప్రాయం ఉండదని తేటతెల్లమవుతుంది. ఈ వీడియో ద్వారా ప్రజాప్రతినిధి పదవికి రాహుల్‌ అనర్హుడు అని తేలిపోయింది అని స్మృతి విమర్శించారు. ఎంపి, చత్తీస్‌గడ్‌లో రైతు రుణమాఫీపై రాహుల్‌గాంధీ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఆసమయంలో జ్యోతిరాధిత్య సింధియా రాహుల్‌కు మోది ఏం చేయలేదో, మేం అది చేసి చూపించాం అని, మీడియాను ఏ ప్రశ్నలు అడగకండి అని సూచనలు చేశారు. ఆ వీడియా తాజాగా వైరల్‌గా మారింది.