రాష్ట్ర సుభిక్షం కోసం రాజశ్యామల యాగం

kcr rajashyamala yagam
kcr rajashyamala yagam

సిద్దిపేట: టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ పర్యవేక్షణలో ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల, మహా రుద్ర సహిత యాగాలు జరిగాయి. కేసీఆర్‌ దంపతులతో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రాజశ్యామల హోమంలో భాగంగా సూర్య నమస్కారాలు, మహా లింగార్చన, అన్ని గ్రహాలకు హోమాలు, చండీయాగం తదితర పూజాధికాలు జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 75 మంది రుత్వికులు ఇందులో పాల్గొన్నారు. సోమవారం ఉదయం 11.11 గంటలకు పూర్ణాహుతితో ఈ యాగం పరిపూర్ణమవుతుందని యాగ నిర్వాహకులు తెలిపారు. అదే రోజు ఏకరాత్రి దీక్షలుంటాయని వెల్లడించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నదే యాగం లక్ష్యమని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.