రాష్ట్ర బంద్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని…

AP CM BABU1
AP CM BABU1

రాష్ట్ర బంద్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రేపటి రాష్ట్ర బంద్ పై సీఎం చంద్రబాబునాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… జనజీవనానికి ఇబ్బందులు  కలగకుండా చూడాలన్నారు. అరాచక శక్తులు బంద్ లో చొరబడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. సీసీ కెమెరాలు, బాడీ కెమెరాలతో నిఘా పెట్టాలన్నారు. రాష్ట్రంలో అల్లర్లు జరగరాదని, శాంతియుతంగా నిరసన తెలపాలన్నారు.