రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌పై వెన‌క్కి త‌గ్గేది లేదుః అవంతి

avanti srinivas
avanti srinivas

న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో మోదీ నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారని ఎంపీ అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పార్టీల మధ్య మోదీ చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నానని… రాష్ట్ర ప్రయోజనాలపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ రాజీనామాలు చేయడం అంటే యుద్దం నుంచి పారిపోవడమే అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ స్థాయిలో పోరాడాలంటే ఎంపీలుగా కొనసాగాలని ఏబీఎన్‌తో ఎంపీ అవంతి అన్నారు.