రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ప్ర‌ధానంః సీఎం చంద్ర‌బాబు

Chandrababu
Chandrababu

అమ‌రావ‌తిః రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆందోళనలకు సిద్దమని సీఎం చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. మహిళా సాధికార మిత్ర సదస్సులో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం కోసం ప్రతిపక్షాలు సహా ఎవరు ఆందోళనలు చేపట్టినా సహకరిస్తామన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు కేంద్రానికి వచ్చిన ఇబ్బందేంటని ఆయన ప్రశ్నించారు. సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.