రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు

 students
students

ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌- కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఉద్యోగాలు: మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు
విభాగం: కెమికల్‌ 25
అర్హత: కెమికల్‌ విభాగాల్లో కనీసం 55 శాతం మార్కులతో బిఈ/ బీటెక్‌/ బిఎస్సీ – ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులే
వయసు: ఏప్రిల్‌ 1 నాటికి 25 ఏళ్లు మించకూడదు
ఎంపిక: కెమికల్‌ విభాగాలకు నిర్దేశించిన గేట్‌ పేపర్‌ 2018లో అర్హత పొంది ఉండాలి. ఈ స్కోరు ఆధారంగానే అభ్యర్థులను ఇంటర్వ్యూకి షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. గేట్‌ స్కోరు ్క్ష ఇంటర్వ్యూ మార్కులకు 60:40 నిష్పత్తిలో వెయిటేజీ ఇస్తారు.
వేతనం: నెలకు రూ.30,000
విభాగం: మార్కెటింగ్‌ 10
అర్హత: బిఎస్సీ / ఎంఎంఎస్‌ / ఎంబీఏ (మార్కెటింగ్‌) పూర్తిచేసి ఉండాలి.
వయసు: 27 ఏళ్లు మించరాదు
ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.700
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్‌ 12
ఉద్యోగాలు: మేనేజర్‌, సీనియర్‌ ఆఫీసర్‌
విభాగం: లీగల్‌
ఖాళీలు: 2
అర్హత: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. నిర్దేశించినమేరకు అనుభవం తప్పనిసరి
వయసు: మేనేజర్‌కు 40 ఏళ్లు, సీనియర్‌ ఆఫీసర్‌కు 35 ఏళ్లు మించకూడదు
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 31
వెబ్‌సైట్‌: www.rcfltd.com