రాష్ట్రాలపై కేంద్రం వివక్ష తగదు

PUDUCHERY CM
PUDUCHERY CM

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని పుదుచ్చేరి సియం నారాయణస్వామి ఆరోపించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నిధుల కేటాయించడం సరైంది కాదన్నారు. పన్నులను రాబట్టుకునే సమయంలో కేంద్ర పాలిత ప్రాంతాలుగానూ.. నిధులు కేటాయింపులో మాత్రం రాష్ట్రాలుగా పరిగణించడం సరికాదని హితవు పలికారు. కేంద్ర పాలిత ప్రాంతాలను ట్రాన్స్‌జెండర్లుగా చూడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి జైట్లీకి లేఖ రాస్తే కనీస స్పందన లేదని చెప్పారు. ఇదేనా సమాఖ్య ?అంటే అని ఆయన కేంద్రాన్ని నిలదీశారు.