రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని తహ్నౌన్‌ని కోరిన చంద్రబాబు

C M Chandrababu Naidu

ఏపి సీఎం చంద్రబాబు యుఏఈలో పర్యటిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో యుఏఈ అధ్యక్షుడు
అల్లుడు షేర్‌ హామీద్‌ బిన్‌ తహ్నౌన్‌ అల్‌ నహ్యాన్‌ని చంద్రబాబు కలిశారు. ఏపిలో ఉన్న అవకాశాలు, వనరుల
గురించి ఆయనకు వివరించారు. కొత్త రాష్ట్రం అభివృధ్ధికి సహాకారం అందించాలని చంద్రబాబు కోరారు.
చంద్రబాబు వినతికి తహనౌన్‌ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అంతకుమునుపు గల్ఫ్‌ వ్యాపార
దిగ్గజం డాక్టర్‌ బిఆర్‌ షెట్టితో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అల్వాహార విందులో
పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.