‘రాష్ట్రపతి’ తెరపై రాజకీయ విన్యాసం

Rastrapati Bhavan
Rastrapati Bhavan

‘రాష్ట్రపతి’ తెరపై రాజకీయ విన్యాసం

దక్షిణ భారతదేశ రాజకీయాలను కొదవపెట్ట్టడానికి వెంక య్యనాయుడు ఒక ఆంజనేయుడుగా పనిచేస్తున్నారు. వెంకయ్యనాయుడు వల్ల భారతదేశానికి చాలా నష్టం జరిగింది. జరుగుతుంది.ఎందుకంటే ఆయన ఎబివిపి కాలం నుండి కూడా మత రాజకీయాల్లో కూరుకుపోయి ఉన్నారు. మొదటి నుంచి ఆయన దళితులకు వ్యతిరేకి. రిజర్వేషన్‌ వ్యతిరేక పోరాటంలో ఆనాడు కీలకపాత్ర వహించారు.

నూతన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత ప్రత్యేక హోదా రాకుండా కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. నిన్న రాష్ట్రపతి పదవికి పేరు లేకుండా ప్రతిపక్షాలను మద్దతివ్వమని కోరటానికి వెళ్ళారు. ఆరెస్సెస్‌ కార్యకర్తలు సిపిఎం కార్యాలయంలో ఏచూరి సీతారామ్‌పై దాడిచేశారు. వెంకయ్యనాయుడు,ఏచూరి ఇద్దరు తెలుగువాళ్ళే. ఇద్దరూ జెఎన్‌యు విద్యార్థులే. ఇద్దరూ ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించినవాళ్ళే.సరే వెంకయ్యనాయుడు దాడి చేయిం చకపోయినా నిత్యం విలేకర్లతోఉండే వెంకయ్యనాయుడు ఇది తప్పు అని ఎందుకు అనలేదు.అలాగే ఇవాళ అవకాశం వచ్చింది కాబట్టి ఏచూరి దగ్గరకు పేరును సూచించకుండా అంతర్గతంగా ఆరెస్సెస్‌ భావజాలం ఉన్నవాడిని నియమించాలనే వ్యూహంతో రావటం ఆశ్చ ర్యం. అంతేకాక అద్వానీ ఈయన గురువ్ఞ. కొన్ని సంవత్సరాలు ఆయనను కీర్తించి,స్తుతించి, నిరాజనాలు పట్టి, ఆయన బాబ్రీ మసీదు కేసుల్లో ఇరుక్కునే దాకా రెచ్చగొట్టిన వాడిలో ఈయన ఒకరు.ఆయనిప్పుడు కేసుల్లో ఇరుక్కుంటే వెంక య్యనాయుడు మీరు రాష్ట్రపతిగా వద్దులే సార్‌ అని చెప్పటానికి వెళ్ళాడు.అద్వానీ ముఖంలో గురువ్ఞకు వెన్నుపోటు పొడిచిన వాడా! అనే ఆశ్చర్యార్థకం కనబడుతుంది.

అలాగే జోషిగారి ఇంటికి కూడా వెళ్ళాడు.నేను, మోడీ,అమిత్‌షా హిందూవాద రాజ్యాన్ని ఎలా పున ర్నిర్మిస్తున్నామో వ్యంగ్యార్థంలో చెప్పివచ్చారు. నిజానికి అద్వానీ పాకిస్థాన్‌లో జన్మించారు. 2005లో ఆయన విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్‌లో జిన్నా సమాధిని వీక్షించారు. వీక్షించినప్పు డు ఆర్‌స్సెస్‌ వాళ్ళు పెద్ద దుమారం లేపారు. ఈ సందర్భంగా అద్వానీ ఇలా అన్నారు. ‘నేను జిన్నా సమాధికి వెళ్ళడం వల్ల వచ్చి న తుఫాను గురించి కరాచీలో ఉండగానే నాకు తెలిసింది. పాకిస్థాన్‌ రాజ్యాంగ అసెంబ్లీలో లౌకికవాద రాజ్యం గురించి జిన్నా చేసిన ప్రసంగం పూర్తి పాఠాన్ని ఢిల్లీలోని నా పార్టీ సహచరులకు పంపా ల్సిందిగా నేను నా సిబ్బందిని కోరాను.మరసటి రోజు2005 జూన్‌ న విదేశీ సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలు,చట్టంపై కరాచీ మండలి లో నేను చేసిన ప్రసంగం ముసాయిదాను కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాను.ప్రసంగంపై నేను వ్యాఖ్యలు చేయాల్సిన అవసరాన్ని,సందర్భాన్ని ఇందులో వివరించారు. నిజానికి లౌకికి వాద పాకిస్థాన్‌ జిన్నా కన్న కలల గురించి ఒక ప్రజావేదికపై నేను ప్ర స్తావించడం ఇది మొదటిసారికాదు.

నా సహచరుడు దీనానాధ్‌్‌ మిశ్రా ఏర్పాటు చేసిన ఇండియా ఫస్ట్‌ పౌండేషన్‌ సమావేశంలో 2004 ఫిబ్రవరి 28న కూడా నేను ఇవే అభిప్రాయాలను వ్యక్తం చేశాను.ప్రముఖజర్నలిస్టు,ఆరెస్సెస్‌ నాయకత్వంలో దీర్ఘకాలం సన్ని హిత సంబంధాలున్న ప్రొఫెసర్‌ ఎస్‌.జి.కాశీకర్‌ రచించిన డైలాగ్‌ విత్‌ పాకిస్థాన్‌ అన్న పుస్తకాన్ని ఈ సమావేశంలో నేను ఆవిష్కరిం చాను. అద్వానీ ఆ సందర్భంగా జిన్నాను లౌకికవాది అని పేర్కొ న్నారు.ఆరెస్సెస్‌బ్రాహ్మణులకు చాలామందికి అద్వానీఅంటే ద్వేషం ఉంది.ఎందుకంటే ఆయన పాకిస్థాన్‌లో పుట్టాడు. కాయస్థుడు కూడా ఆ సందర్భంగా అటల్‌బిహారీ వాజ్‌పే§్‌ు,జశ్వంత్‌సింగ్‌ మరి కొంత మందిని అద్వానీని సమర్థించారు. నిజానికి ఒక పాకిస్థాన్‌లో పుట్టినవాడు రాష్ట్రపతి కాకూడదనే భావజాలం ఆరెస్సెస్‌ కొంతమం దికి ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి.

అద్వానీ కూడా కరుడు గట్టిన హిందూవాదే. కానీ ఆయన కంటే కరుడుకట్టినవాళ్ళు ఆరెస్సె స్‌లో ఉన్నారు.నిజానికి ఆరెస్సెస్‌ వారికి భారతరాజ్యాంగ సూత్రాల మీద నిర్ధిష్టమైన అభిప్రాయం లేదు.వాళ్ళు మనుస్మృతినే పాటి స్తారు. ముస్లింలు,క్రైస్తవ్ఞలు అంటే తీవ్రమైన ద్వేషం వారికి. వెంక య్యనాయుడు ఆయనకుండే అనాలోచితమైన పనుల వల్ల దక్షిణ భారతానికి చాలా పెద్ద నష్టం జరుగుతుంది. అంబేడ్కర్‌ ఆయా రాష్ట్రాల్లో భూస్వామ్యకులాలే పెత్తనం చేస్తూ ఉంటారు. కులవ్యవస్థ రాష్ట్రాల్లో బలంగా ఉంది. ఈ కులాధిపత్య ప్రతినిధులే ఒక సమూహంగా దేశాన్ని పాలిస్తున్నారని స్పష్టంగా చెప్పారు. ‘పంజాబ్‌నే తీసుకోండి. జాట్‌లే ఆ ప్రాంతమంతా ఆధిపత్యం చెలాయిస్తుంటారు.

అంటరాని కులాలవారు వారిపై ఆధారపడి బతు కుతుంటారు. ఆంధ్రనే తీసుకోండి.ఆ భాషా ప్రాంతమంతటా రెండు లేక మూడు ప్రధానకులాలు విస్తరించి ఉన్నాయి.వారు రెడ్లూ,కమ్మ లూ, కాపులూ అయి ఉంటారు. మొత్తంభూమి అంతా వారిదే. అన్ని ఉద్యోగాలు,అన్ని వ్యాపారాలు వారివే. అంటరాని కులాల వారు వారిపై ఆధారపడి బతుకుతుంటారు. మహారాష్ట్ర ఉదాహరణ తీసుకుందాం.మహారాష్ట్రలోని ప్రతిగ్రామంలోనూ మరాఠ కులస్థులు పెద్దసంఖ్యలో ఉన్నారు.బ్రాహ్మలూ, గుజార్లూ,కూలీలు, అంటరాని వారూ వారికి అణిగి సహకరిస్తూ బతుకుతుంటారు.

బ్రాహ్మలూ, బనియాలు ఎటువంటి భయంలేకుండా జీవించిన కాల మొకటుంది. కాని ఇప్పుడు కాలం మారిపోయింది. గాంధీ హత్యానంతరం మరా ఠాల నుండి బ్రాహ్మలూ,బనియాలూ ఎంతటి వేధింపును ఎదుర్కొ న్నారంటే భద్రత కోసం వారు పట్టణాలకు పారిపోవలిసి వచ్చింది. మెజారిటీ మరాటా కులస్థుల నిరంకుశత్వాన్ని భరించేందుకు దౌర్భాగ్యులైన అంటరానివారు కోలీలూ,మాలీలు మాత్రమే గ్రామా ల్లో మిగిలారు.

ఈ కులవ్యవస్థ ఏర్పాటును మరిచిపోయిన వారు తమకు తాము ఆపద కోరి తెచ్చుకున్నట్లే. అంబేడ్కర్‌ భారత దేశ నిర్మాణంలో వస్తున్న ఆధిపత్యాలపట్ల స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేశారు. ఆయా రాష్ట్రాల్లోభూమి వ్ఞన్న కులాలు,భూమిలేని కులాల మీద ఆధిపత్యం వహించడమే గాక ఢిల్లీలో వీళ్ళందరూ ఒక సమా ఖ్యగా ఏర్పడిఢిల్లీ ఆధిపత్యానికి సామంతులుగా వ్యవహరించే అవ కాశం వ్ఞంటుందని ఆయన భావించారు.నిజానికి వెంకయ్య నాయు డు దక్షిణ భారతదేశపు హక్కులు అడగాల్సిన వాడు. వాటిని కాల రాసే పనిలో వ్ఞన్నాడు. కనీసం శూద్రకులాలల ప్రతినిధిగా కూడా అతను వ్యవహరించడం లేదు. నిజానికి భారతదేశ అఖండతను కాపాడాలి.

అంటే తప్పకుండా దక్షిణ భారతదేశంలో రెండో రాజ ధాని దక్షిణ భారతదేశంలో తప్పక వ్ఞండాలి. హైదరాబాదు కాని విశాఖపట్టణానికి గాని మొత్తం భారతదేశంలో ఉన్న ముఖ్యపట్టణా లకు ఢిల్లీ కంటే చాలా తక్కువ దూరం ఉంటుంది. అందుకు అంబే డ్కర్‌ హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేయమని అడిగాడు. ఢిల్లీకి అన్ని రాజధానులు దూరంగా ఉన్నాయి. ముంబాయి నుంచి ఢిల్లీకి 798,హైదరాబాదుకు440,కలకత్తా నుంచి ఢిల్లీకి 868, హైదరాబాదుకు 715,మద్రాసు నుంచి ఢిల్లీకి1,195,హైదరాబాదు కు330,కర్నూల్‌ నుంచి ఢిల్లీకి957హైదరాబాదుకు275,త్రి వేండర నుంచి ఢిల్లీకి 1,521 హైదరాబాదుకు 660,పాటియాలా నుంచిఢిల్లీ కి 124,హైదరాబాదుకు990,ఛంఢీగర్‌ నుంచి ఢిల్లీకి 180,హైదరా బాదుకు 1,045,లక్నోనుంచి ఢిల్లీకి 275,హైదరాబా దుకు 770, ఢిల్లీకంటే హైదరాబాదుకైనా,విశాఖపట్టణానికైనా అన్నిరాష్ట్రాల దూ రం చాలా తక్కువగా వ్ఞంటుంది.దక్షిణ భారతదేశంలో తెలుగు, తమిళ,కన్నడ,మళయాల భాషలు, పరిశ్రమలు అభివృద్ధి చెందడా నికి రెండవ రాజధాని ఎంతో అవసరం.

ఢిల్లీ నుంచి పాలించే మోడీ ఒక్క పది రోజులు కూడా దక్షిణ భారతదేశంలో ఈ మూడేళ్ళలో నివసించలేదంటే దక్షిణభారతదేశం భారత ప్రధానులచేత ఎంత నిర్లక్ష్యం చేయబడుతుందో మనకు అర్థమౌతుంది. భారతదేశ చరిత్ర అనడంతో దక్షిణ భారతదేశ చరిత్రలో ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉత్తర భారత చరిత్రనే మొత్తం భారతదేశ చరిత్రగా ప్రచారం చేస్తు న్నారు. భారతదేశ సంస్కృ తిని, అఖండతను కాపాడాలంటే తప్ప కుండా దక్షిణ భారతదేశంలో మరో రెండవరాజధాని రూపొందించు కోవాల్సిన అవసంం ఉంది.భారతదేశంలో నివసిస్తున్న హిందువులు, షెడ్యూల్డు కులాలు, ముస్లింలు,ఇండియన్‌ క్రిస్టియన్‌న్లు, ఆంగ్లో ఇండియన్లు, పార్శీలు,సిక్కులు,జైనులు,బౌద్ధులు,గిరిజనులు స్వేచ్ఛ గా జీవించే ప్రభుత్వం కావాల్సి వ్ఞంది. రాజ్యాంగ రక్షణను కల్పించే రాష్ట్రపతి ఇప్పుడు మనకుఅవసరం.

భారతదేశంలో ఈనాడు పాలనా యంత్రాంగం పూర్తాగా హిందువుల చేతిలో ఉండటంవల్ల వారి గుత్తసామ్యం పై నుండి క్రింది వరకు వారి నియంత్రణలో ఉండటం వల్ల దళితులు అన్ని రంగాల్లో అస్పృశ్యతకు గురిఅవ్ఞతున్నారు. ఒక్కవిషయాన్ని మనం సామా జిక దృష్టి నుండి చూస్తే పాలక వర్గం బయటఉన్న అగ్రకులాలకు ఏభావం దళిత కులాల మీద వ్ఞందో,పాలనలో వ్ఞన్న అధికారవర్గం అదే భావంలోఉంది.వీరికి ఒకే అండ రాజ్యాంగం.ఆ రాజ్యాంగంమీద విశ్వాసంలేని రాజ్యాంగా న్ని అధిగమించే ప్రధానమంత్రు లు, రాష్ట్రపతులు వచ్చినప్పుడు దళితులకు రక్షణే లేదు.

రామ్‌నాథ్‌ కోవింద్‌ భావజాల పరంగా ఆరెస్సెస్‌ భావాలు కలిగిన వ్యక్తి.ఈయన దళితుల మీద దాడులు జరుగుతున్న సందర్భంలో ఖండించలేదు. బీజేపీ చేసే తప్పిదాలను ఆమోదిస్తు సందర్భంగా విమర్శించటానికి వీలు లేకుండా వారిని నియమించారు. ఈనాడు కాంగ్రెస్‌, మిత్రపక్షాలు,ఇతరపక్షాలు, లౌకికవాద దళితులు సుశీల్‌కుమార్‌షిండే కాని,మీరాకుమార్‌ను కాని ప్రతిపాదించటం, ముదావహం.ఇదే సందర్భంలో రాబోయే 2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు, జగన్‌,కేసీఆర్‌ విద్యావంతులు, అవినీతి లేని దళిత అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించవలసిన అవసరం ఉంది. వీరువ్ఞరు దక్షిణ భారతీయుల హక్కుల్ని ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారు.

ఇక కె.సి.ఆర్‌.అయితే తాత్కాలిక ప్రయో జనాల కోసం కుటుంబంలో ఉండే తమ కుమారులకు, బంధు వ్ఞలకు పదవ్ఞల కోసం పాకులాడే వీరంతా రాజకీయ వ్యక్తిత్వాన్ని కాపాడుకోలేక పోతున్నారు. ఈ సందర్భంగా సామాజిక,రాజకీయ శక్తులన్నీ ఏకమై మానవ విలువల రాజకీయాలను,భారతీయ సమగ్రతను,సంపదను కాపాడే ఉద్యమకారులుగా రాజకీయ వేత్తలుగా రూపొందాల్సిన చారిత్రక సందర్భం ఇది. స్వాతంత్య్రాన్ని సంపాదించుకోవడం మనందరి బాధ్యత.

-డాక్టర్‌ కత్తి పద్మారావు

(రచయిత: ఆంధ్ర సాహిత్య చరిత్రకారుడు)