రాష్ట్రం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం

TDP
TDP MP’s

కడప ఆమరణ నిరాహార దీక్షకు ఎంపిల మద్దతు
రాష్ట్రం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం
వైఎస్సార్సీ ఎంపిల ‘రాజీ’ డ్రామాలు

కడప: రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష్యసాధింపు దీక్షగా వ్యవహరిస్తోందని ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుంటా నాలుగేళ్లపాటు కాలయాపన చేసి రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలిందని టిడిపికి చెందిన 13 మంది ఎంపిలు పేర్కొన్నారు. మిత్ర పక్షంగా ఉన్న బిజెపి వెన్నుపోటు పొడచడం తో ఆ పార్టీతో అధినేత చంద్రబాబునాయుడు తెగతెంపులు చేసుకొని రాష్ట్ర అభివృద్ధికి పోరా డుతున్నారన్నారు. గత 10 ఏళ్ల నుండి ఎన్నడు జరగని అభివృద్ధి ఈ నాలుగేళ్లలో జరిగింద న్నారు. రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్‌, ఎమ్మెల్సీ బిటెక్‌ రవి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు 3వ రోజు 13 మంది ఎంపిలు సంఘీ భావం తెలిపేందుకు కడప జిల్లాపరిషత్‌ ప్రాం గణంలో జరుగుతున్న దీక్షా స్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపి శివప్రసాద్‌ మాట్లాడుతూ హామీలు నెరవేర్చలేదని మిత్ర పక్షం నుండి బయటకు వస్తే నిందలు మోపు తున్నారన్నారు. ప్రధాని మోడి పప్పులు దేశంలో ఉడకవని తెలుగు ప్రజలతో పెట్టుకుంటే ఎవరైన ఓటమి పాలవుతారని తెలిపారు.