రాష్ట్రంలో దుర్మార్గపు పాలన

B VIKRAMARKA
B VIKRAMARKA

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ సియం కేసిఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని ,రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతుందని టిపిసిసి వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను రాజ్‌భవన్‌లోనే పాతరేశారన్నారు. మహాకూటమి ఏర్పాటుకు అన్నివర్గాలు సహకరించాలని అన్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోనే మహాకూటమి ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి ఆలోచనలతో ముందుకు వెళ్లాలని, తెలంగాణలో టిఆర్‌ఎస్‌ అంతమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. గద్దర్‌, విమలక్క, చెరుకుసుధాకర్‌ లాంటివారు మాతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.