రాష్ట్రంలో కంటే కేంద్రం అప్పులే ఎక్కువః కేసిఆర్‌

kcr
kcr

హైద‌రాబాద్ః రాష్ట్రంలో అభివృద్ధి పథకాల కోసమే ప్రభుత్వం అప్పులు తీసుకువచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రం కంటే కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులే ఎక్కువని అన్నారు. చాలా దేశాల్లో జీడీపీ కంటే అప్పులే ఎక్కువ ఉన్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. విపక్షాలకు రాష్ట్ర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కనబడటం లేదా అని సీఎం ప్రశ్నించారు. రూ.వెయ్యి పెన్షన్‌ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా? అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. 22 శాతం వృద్ధిరేటుతో దేశంలో తెలంగాణ నంబర్‌వన్‌ రాష్ట్రంగా ఉందని, చిన్న చిన్న పొరపాట్లు జరిగితే రైతు రుణమాఫీ జరగలేదంటారా? అంటూ ముఖ్యమంత్రి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే రాష్ట్ర ఉద్యోగులకే జీతాలు ఎక్కువగా ఉన్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు.