రాష్ట్రంలో ఇంకా బ్రోకర్ల రాజ్యం కొనసాగుతుంది: ఈటల

etala
etala

హైదరాబాద్‌: గురువారం నగరంలోని యూసఫ్‌గూడ ఇండోర్‌ స్టేడియంలో ముద్ర రుణాలపై అవగహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీ నిధి బ్యాంక్‌ ద్వారా తెలంగాణ సర్కార్‌ రుణాలు ఇస్తోందని, అయితే ఆశించిన స్థాయిలో రుణాలు పేదలకు అందటం లేదని, ఇంకా బ్రోకర్ల రాజ్యం నడుస్తోందని, వాళ్లకు పుల్‌స్టాప్‌ పెట్టాలని అన్నారు. డిజిటల్‌
లావాదేవీల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని, పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం నిర్ణయం తీసుకోగానే తెలంగాణ సర్కార్‌ స్వాగతించిందని, అలాగే మహిళలకు రుణాలు ఇవ్వడంతో కొంత వెనుకంజలో ఉన్నామని ఈటల అన్నారు.