‘రావిపూడి’ అడిగితే కాదనలేకపోయా

Rakul-1
Rakulpreet Singh

‘రావిపూడి’ అడిగితే కాదనలేకపోయా: రాశీఖన్నా

ఊహలు గుసగుసలాడే సినిమాలో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రాశిఖన్నా మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.. ఆ సినిమా తర్వాత గ్లామర్‌ హీరోయిన్‌గా మంచి ఇమేజ్‌ తెచ్చుకున్న రాశి స్టార్‌ హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకుని దూసుకుపోతోంది.. తాజాగా ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో నటిస్తున్న జై లవకుశ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.. ఈచిత్రంఈనెల 21న విడుదల అవుతున్న సందర్భంగా రాశిఖన్నాతో జరిపిన ఇంటర్వ్యూ..

మీ పాత్ర ఎలా ఉటుంది?
ఇందులో నా పేరు ప్రియా.. ఓ మ్యారేజ్‌ బ్యూరో నడిపించే అమ్మాయిని.. సరదాగా ఉంటూనే.. లవ కుమార్‌ ప్రేమలో పడే అమ్మాయిగా నటించాను.. చాలా బాబ్లీపాత్ర ఇది.

మీ పాత్రకు డబ్బింగ్‌ చెప్పారా?
లేదు, నిజానికి డబ్బింగ్‌ చెప్పాలని అనుకున్నాను.. కానీ వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు.. దర్శకు బాబీ కూడా అడిగారుచెప్పమని,, కానీ నెక్ట్స్‌ సినిమా విషయంలో మాత్రం ఇలాంటి చాన్స్‌ వదులుకోను.

ఎన్టీఆర్‌తో నటించటం ఎలా ఉంది?
ఎన్టీఆర్‌ నిజంగా బ్రిలియంట్‌ ఆర్టిస్టు. ఈ షూటింగ్‌లోచూశా.. నిజంగా ఆయన ఎనర్జీ ఊహించలేం.. అందులో కొంచెం మనం అందుకున్నా సూపర్‌.. సినిమా అంటే తనకు అంత పిచ్చి.. హార్డ్‌ వర్క్‌, డెడికేషన్‌ చూసి షాక్‌ అయ్యా..అందుకే ఆయనఅంత గొప్ప స్టార్‌ అయ్యారు.

ఎన్టీఆర్‌ నటిస్తున్న మూడు పాత్రల్లో మీకు ఏది బాగా నచ్చింది?
తప్పకుండా జై పాత్ర అనే చెబుతాను.. ఎందుకంటే ఆ పాత్రలో ఎన్టీఆర్‌ అద్భుత నటన చాలా బాగా నచ్చింది.. పైగా సెట్‌లో కూడ ఆ పాత్ర చేస్తున్నపుడు ఆయన బాడీ లాంగ్వేజ్‌ కూడ మారిపోయేది..

డాన్స్‌ విషయంలో ఎన్టీఆర్‌తో పోటీ పడ్డారా?
ఎన్టీఆర్‌ నిజంగా గొప్ప డ్యానర్సర్‌.. ఈ విషయం నేను కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.. ఆయన అద్భుతంగా స్టెప్స్‌ అదరగొడతారు.. ఈసినిమాలో తనతో కలిసి డ్యాన్స్‌ చేయటం కాస్త కష్టమే అన్పించింది.. కానీ ఏదో అలా మేనేజ్‌ చేశా (నవ్వుతూ)

మరో హీరోయిన్‌తో కలిసి పనిచేయటంఎలా అన్పించింది?
అందులో తప్పేముందు.. ఎవరి పాత్రలు వారివే.. ఇందులో నివేదతో కలిసి నటించటం చాలా ఆనందంగా ఉంది.. నివేద టాలెంట్‌ ఉన్న నటి. పైగా ఈ మధ్యే తాను నటించిన నిన్ను కోరి సినిమాచూశాను.. అద్భుతంగా చేసింది..

మళ్లీ రవితేజతో సినిమా చేస్తున్నారు?
రాజా దిగ్రేట్‌ సినిమాలో ఓచిన్న గెస్ట్‌పాత్ర అది.. రవితేజ , మెహ్రీన్‌ కౌర్‌ కలిసి చేస్తున్న పాటలో కాసేపు స్పెషల్‌ అప్పీరియన్స్‌ ఇస్తా.. దర్శకుడు అనిల్‌ రావిపూడి అడిగితే కాదనలేకపోయా..

హీరోయిన్‌గా మీ ప్రాధాన్యత దేనికి? గ్లామర్‌ కా ..లేక నటనకా?
ప్రతిహీరోయిన్‌కు ఎరురయ్యే ప్రశ్న ఇదే కదా.. తెలుగులో హీరోయిన్‌ అన్నాకా.. గ్లామర్‌ తప్పనిసరి.. అలాగే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడ చేయాలి.. అపుడే మనం అనుకున్న ఇమేజ్‌ దక్కించుకోగలం.

తెలుగులో గ్యాప్‌ రావటానికి కారణం?
తమిళంలో రెండుసినిమాలు చేస్తున్నారు.. దాంతోపాటు మలయాలంతో విలన్‌ సినిమాలో నటిస్తుండటం వల్ల ఇక్కడ డేట్స్‌ కుదరలేదు.. అందుకే కొంత గ్యాప్‌ వచ్చింది.. ఇకపై రాదులెండి..

తదుపరి చిత్రాల గురించి?
సాయిధరమ్‌తేజ్‌తో ఓ సినిమా చేస్తున్నారు..అలాగే బాలకృష్ణుడు, సినిమాల్లో చేస్తున్నా..