‘రాయ‌ల‌సీమ ప‌రిర‌క్ష‌ణ స‌మితి’ పార్టీని మూసివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన బైరెడ్డి

by reddy rajashekar reddy
by reddy rajashekar reddy

క‌ర్నూలుః రాయ‌ల‌సీమ పరిరక్షణ సమితి పార్టీ (ఆర్పీఎస్)ని మూసివేస్తున్నట్టు ఆ పార్టీ వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు.
మంగ‌ళ‌వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ వాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాను కానీ, వారి నుంచి సరైన
ప్రోత్సాహం తనకు లభించలేదని అన్నారు. ఏ పార్టీలో చేరే విషయాన్ని తాను త్వరలో ప్రకటిస్తానని అన్నారు. అయితే, తెదేపాలో
చేరమని బైరెడ్డి అనుచరులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కాగా, రాయలసీమ పరిరక్షణ పార్టీని 2013లో బైరెడ్డి
రాజశేఖరరెడ్డి స్థాపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని 2013 జులై 30న తీర్మానం వెలువడిన అనంతరం ఆర్పీఎస్
ఏర్పాటు చేయడం జరిగింది.