రాయితీలపైనే అందరి ఆశలు

RAJESH11

రాయితీలపైనే అందరి ఆశలు

హైదరాబాద్‌, జనవరి 26: పెద్దనోట్లరద్దు అనంతరం వెలువడుతున్న బడ్జెట్‌ కావడంతో ప్రభుత్వ రాయితీలపై ఎక్కువ దృష్టిసారిస్తుందని మాక్స్‌లైఫ్‌సిఎండి రాజేష్‌ సూద్‌ పేర్కొన్నారు. ప్రత్యక్షపన్నులపరంగా కార్పొరేట్‌ పన్నును తగ్గించాల్సి ఉంటుందుఇన, వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబ్‌లను సవరించి మినహాయింపులు పెంచాలని ఆర్థికవృద్ధికి దోహదకారిగా ఇపేమెంట్‌ విధానం పెంపొందించాలని ఆయన కోరా రు. ఉపాధి వృద్ధికి బడ్జెట్‌లో పలు ప్రోత్సాహకాలు ఉండాల్సిన అవ సరం ఉందన్నారు. బీమాఉత్పత్తులపరంగా చూస్తే సీనియర్‌ సిటిజన్ల కు మరిన్ని రాయితీలుండాలని, అదనంగా ఎన్‌పిఎస్‌లో 50వేల పరిమితిని పెంచాలని సూచించారు. సెక్షన్‌80సి పరిమితులు పెంచాలని, కార్పొరేట్‌ వృద్ధికి కీలకమైన ప్రోత్సాహకాలు ఎంతో అవసరం అన్నారు. బీమారంగం ఉత్పత్తులపెంపునకు వీలుగా ప్రభుత్వ బడ్జెట్‌ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.