రాయలసీమ ఇక పారిశ్రామిక సీమ

AP MINISTER LOKESH
AP MINISTER LOKESH

రాయలసీమ ఇక పారిశ్రామిక సీమ

అమరావతి: దశాబ్ధాలుగా నీరులేక నిస్తేజమైన రాయలసీమ నేడు జలవ నరులతో కళకళలాడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో అధికారం లోకి వచ్చిన నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రా యలసీమ రూపురేఖలు మార్చి పారిశ్రామికాభి వృద్ధికి బాటవేసిందని ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, పం చాయితీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.

అనంతపురం జిల్లాలో దక్షిణ కొరియా కంపెనీ కియా మోటార్స్‌ తన కార్ల ఫ్యాక్టరీని అనంతపురంలో నెలకొల్పడమే ఇందుకు నిద ర్శనమని లోకేశ్‌ అన్నారు. నదుల అనుసంధా నంతో రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమకు మునుపున్నడూ లేనంతగా నీరు తెచ్చిందని వివరించారు. అందువల్లనే అనంతపురం జిల్లా నేడు ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికాభివృద్ధికి ముఖ్య కేంద్రంగా రూపుదిద్దుకోటోందని ఆయన చెప్పారు. నదుల అనుసంధానం దశాబ్ధాలుగా ఒక కలగా మిగిలిందని, గోదావరి-కృష్ణా అను సందానం ద్వారా తాము చేసి చూపించామని లోకేశ్‌ చెప్పారు. సమీప భవిష్యత్తులో మరిన్ని నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని అత్యు న్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. మం గళవారం సిఐఐ పిడబ్ల్యుసి సంయుక్తంగా నిర్వ హించిన ఇండస్ట్రియల్‌ కారిడార్స్‌ ఇన్‌ ఇండియా వ్యాపార విభాగ(బిజినెస్‌ సెషన్‌)లో మంత్రి నారా లోకేష్‌ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌ రెం డు పారిశ్రామిక నడవలు ఒక వరమని, వైజగ్‌- చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌, చెన్నె-బెంగళూరు ఇండస్ల్రియల్‌ కారిడార్లని వ్యూహాత్మకంగా ఆం ధ్రప్రదేశ్‌ పారిశ్రామికాభివృద్ధి కోసం జలవనరుల అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చామని, అందుకే ప్రపంచ ప్రసిద్ధి చెందిన కియా మోటార్స్‌ సంస్ధ ఈ జిల్లాల్లో కార్ల కంపెనీ ఏర్పా టుకు ముందుకు వచ్చిందని అన్నారు.

వివిధ ప్రాంతాల్లో వనరులు, మౌలిక సదుపాయాల లభ్యతను అనుసరించి క్లస్టర్ల వారీగా పారి శ్రామికాభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు లోకేశ్‌ వివ రించారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రానిక్స్‌, సోలార్‌ క్లస్టర్లను ఉదహరిచారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగానికి అనువైన పరిస్ధితులు సృష్టిం చడానికి ఉద్పాదక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నా మన్నారు. తిరుపతి ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లసర్టర్‌లో ఇప్పటికే సెల్కాన్‌, డిక్సన్‌, కార్బన్‌ లాంటి సంస్ధలు కార్యకలాపాలు ప్రారంభించాయని మంత్రి గుర్తు చేశారు. శ్రీ సిటీ సెజ్‌లో ఒకే చోట మహిళలకు 12వేల ఉద్యోగాలు: శ్రీసిటీ సెజ్‌లో ఫాక్స్‌కాన్‌ మొబైల్‌ తయారీ కంపెనీలో ఒకేచోట 12వేల మంది మహిళలకు ఉద్యోగాలు వచ్చాయని మంత్రి లోకేశ్‌ తెలిపారు. మొబైల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌లో బ్యాటరీ తయారీ నుంచి పూర్తిస్ధాయి మొబైల్‌ తయారీ వరకూ ఉన్న అన్ని విడి భాగాల తయారీ కంపెనీలతో క్లస్టర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని ప్రతికూల పరిస్ధితులను సానుకూలంగా మార్చు కుని దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్ర రాజధాని నిర్మానాణానికి 35వేల ఎకరాల భూమిని సమీ కరణ పద్ధతిలో తీసుకున్నామని, రాజధాని నిర్మా ణంలో రైతులను భాగస్వాములను చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపుతో ఎంతో విశ్వాసంతో రైతులు స్వచ్ఛం దంగా సమీకరణ కింద భూమిని ఇచ్చారని అన్నారు. ఇందువల్ల భూముల విలువ పెరి గింది. అదనంగా పెరిగిన విలువలో ఎక్కువ భాగం రైతాంగానికే దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. భూమిని అభివృద్ధి చేసే రైతాంగానాఇకి వాటి ఇచ్చిందని, జోడించిన అదనపు విలువలో వారే మొదటి లబ్దిదారులగా ఉంటారని తెలిపారు. కాగా సమావేశంలో తొలు త మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్‌ మాట్లాడారు.ఫ్యానల్‌ చర్చలో మంత్రి లోకేశ్‌ సహా, నీతి అయోగ్‌ ప్రతినిధి అమితాబ్‌ కాంత్‌, అపోలో గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ శోభన కామినేని, సిఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత బెనర్జీ, పిడబ్ల్యుసికి చెందిన మనీశ్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.