రామ మందిర నిర్మాణంపై ఆర్డినెన్స్‌కు మద్దతివ్వం

PRASHANT KISHORE
PRASHANT KISHORE

పాట్నా: అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై భారతీయ జనతా పార్టీ ఆర్డినెన్స్‌ తీసుకొస్తే తాము అందుకు మద్దతివ్వబోమని ఆ పార్టీ మిత్రపక్షం జేడియూ స్పష్టం చేసింది. రామ మందిర నిర్మాణ విషయాన్ని లేవనెత్తకుండానే 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించే సామర్ధ్యం బిజెపికి ఉందని అభిప్రాయపడింది. జేడియూ నేతలు మీడియాతో మాట్లాడుతూ..రామ మందిర నిర్మాణం అంశం లేవనెత్తకుండానే 2019 ఎన్నికల్లో గెలిచే సత్తా బిజెపికి ఉందని అని అన్నారు. 2014 ఎన్నికల ముందు కన్నా ఇప్పుడు బిజెపి బలహీనంగా ఉందన్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బిజెపిపై అంతగా ప్రభావం చూపవని ,ఆందోళనకు గురిచేసేవి కావని అన్నారు. రామ మందిరం గురించి జేడియూ బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి.