రామ్‌ చరణ్‌ ధృవ సెన్సార్‌ పూర్తి!

RAM CHARAN in DHRUVA
RAM CHARAN in DHRUVA

ధృవ ..సెన్సార్‌ పూర్తి!

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా ప్రతిష్టాత్మకమైన గీతాఆర్ట్స్‌ బ్యానర్‌పై స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఏస్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌, నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న స్టయిలిష్‌ ఎంటర్‌ టైనర్‌ ధృవ. హై బడ్జెట్‌, టెక్నికల్‌ వాల్యూస్‌తో రూపొందిన ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్‌ సబ్యులు యు/ఎ సర్టిఫికెట్‌ను ఇచ్చారు. సినిమా ప్రారంభం నుండి సినిమాపై భారీ క్రేజ్‌ నెలకొంది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 9న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్‌ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.