రామారావు గారిది విగ్రహం పడగొడితే చేరిగిపోయే చరిత్ర కాదు

విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను..లోకేశ్‌

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్ర‌క్రియ కొన‌సాగుతోన్న‌ నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. దీనిపై టిడిపి నేత నారా లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘మూర్ఖత్వానికి మానవ రూపం వైఎస్ జ‌గ‌న్. మహనీయుల విగ్రహాలు కూలుస్తూ జగన్ రెడ్డి మరింత దిగజారిపోయాడు. దేవతా విగ్రహాలు ధ్వంసం చేసిన వైకాపా గ్యాంగ్ ఇప్పుడు మహనీయుల విగ్రహాల పై పడింది. స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారిది విగ్రహం పడగొడితే చేరిగిపోయే చరిత్ర కాదు’ అని నారా లోకేశ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైఎస్‌ఆర్‌సిపి గ్యాంగ్ ని కఠినంగా శిక్షించాలి’ అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.