రాబోయే రెండేళ్లలో లక్షన్నర ఎకరాలకు సాగునీరిస్తాం

kcr
kcr

కల్వకుర్తి: కాంగ్రెస్‌,టిడిపి పాలనలో కల్వకుర్తి నియోజకవర్గనికి సాగు, తాగునీరు లేక కన్నీళ్లు మిగిలినయి. అని కెసిఆర్‌ పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలని ఆమనగల్లులో ఏర్పాటు చేసిని టిఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్‌ పాల్గొని ప్రసంగించారు. కల్వకుర్తి నియోజకవర్గ అభ్యర్థి జైపాల్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ జన ప్రవహాన్ని చూస్తుంటే.. కల్వకుర్తి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరిపోయిందని ఖాయమైపోయింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిని పూర్తి చేసి సాగునీరు తీసుకువస్తున్నాం. కల్వకుర్తి నియోజకవర్గానికి రాబోయే రెండేళ్లలో లక్షన్నర ఎకరాలకు సాగునీరిస్తాం. ప్రస్తుతం కల్వకుర్తి ఎత్తిపోతల కింద 30 వేల ఎకరాలకు నీరు పారుతోంది. అని కెసిఆర్‌ అన్నారు.