రాబోయే  అసెంబ్లీ ఎన్నికల్లో మాదే విజయం: ఉత్తమ్‌

Uttam Kumar Reddy
వరంగల్‌: శుక్రవారం వరంగల్‌ ఆర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలం భీమారంలో జరిగిన ‘ఇందిరమ్మ రైతు బాట’ కార్యక్రమంలో
టీపీపీసీ ఆధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రాబోయే ఆసెంబ్లీ
ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధికారంలోకి వస్తుందని, కేసీఆర్‌ ప్రభుత్వం ఆబద్దపు ప్రచారాలతో మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. రాజకీయ
దురుద్దేశంతోనే జీవో 39ను తీసుకొచ్చారని, ఎక్కడికక్కడే రైతు సంరక్షణ సమితులను ఏర్పాటు చేసుకుని రైతు సమస్యలపై పోరాటం
చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పనిచేసే ప్రతి రైతుకూ రూ.4వేలు ఇవ్వాలని, బతుకమ్మ పండగకు నాసిరకం చీరలు ఇచ్చి
మహిళలను ఆవమానించారని, తక్షణమే రూ.500లతో నాణ్యమైన చీరలు ఇవ్వాలని, ఇది పూర్తిగా నాసిరకం ప్రభుత్వం అని
ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నాసిరకం పనుల వల్ల 8మంది మృత్యువాత పడ్డారని విమర్శించారు.