రాఫెల్‌పై కేంద్రం అసత్యాల అఫిడవిట్‌

VARLA RAMAIAH
VARLA RAMAIAH

విజయవాడ: రాఫెల్‌ కుంభకొణం వ్యవహారంలో కేంద్రం వ్యవహరించిన తీరు సిగ్గుచేటని టిడిపి నేత వర్ల రామయ్య విమర్శలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..నవంబరు 12 న కేంద్రం సుప్రీం ముందుంచిన అఫిడవిట్‌లో అనేక అసత్యాలు ఉన్నాయని ఆరోపించారు. 36 యుద్ధ విమానాల ధరను మధ్యలో మార్చాల్సిన అవసరమేముందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర రక్షణ మంత్రి సిఫార్సులను ఎందుకు పక్కన పెట్టారన్నారు. 126 విమానాలు కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం36 విమానాలు కొనాల్సి వచ్చిందని వర్ల రామయ్య నిలదీశారు. ఒక్కొక్క యుద్ధ విమానానికి రూ. 526 కోట్లు ఖర్చు ఐతే రూ. 1670 కోట్లుగా చూపుతున్నారన్నారు. మోది తనపై ఒత్తిడి పెంచి అంబానీలకు అనుకూలంగా కాంట్రాక్టు వచ్చేలా చేశారని ఫ్రాన్స్‌ అధ్యక్షుడే బహిరంగంగా చెప్పారని గుర్తు చేశారు. మోది అధికారంలోకి వచ్చిన తర్వాతే రక్షణ ఒప్పందాలన్నీ వివాదాస్పదంగా మారుతున్నాయని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.