రాఫెల్‌తో యుద్ధ సామర్థ్యం పెరుగుతుంది

rafel
rafel

ఎయిర్‌ఫోర్స్‌ వైస్‌ చీఫ్‌ అనిల్‌ ఖోస్ల…
న్యూఢిల్లీ: రాఫెల్‌ యుద్ధ విమానాల రాకతో వైమానిక దళ సామర్థ్యం పెరుగుతుందని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వైస్‌ చీఫ్‌ అనిల్‌ ఖోస్లా అన్నారు. రాఫెల్‌పై రాజకీయ రగడ జరుగుతోన్న నేపథ్యంలో ఆయన ఈవిధంగా స్పందించారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి తొలి రాఫెల్‌ యుద్ధ విమానం భారత్‌కు రానున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్‌లో డెలివరీ చేయగా…దాన్ని భారత్‌కు తీసుకురానున్నట్లు వెల్లడించారు. గతేడాది నవంబర్‌లో రాఫెల్‌ ఫస్ట్‌లుక్‌ బయిటకు వచ్చిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌లో రాఫెల్‌ తొలి యుద్ద విమానానికి పరీక్షలు నిర్వహించారు. సెప్టెంబర్‌ నాటికి రాఫెల్‌ తొలి విమానం భారత్‌కు రానున్నట్లు గత నెల కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో వెల్లడించిన విషయం తెలిసిందే. మిగిలిన విమానాలు 2022 లోపు అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపారు.