రానున్న ఎన్నికల కోసం టిడిపి వినూత్న ప్రచారం

Chandrababunaidu
Chandrababunaidu

అమలాపురం: టిడిపి ప్రభుత్వం రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వినూత్న ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన రోజు నుండి నేటి వరకు అమలు చేసిన సంక్షేమపథకాల ద్వారా లబ్ధిపొందిన వారి జాబితాలతో త్వరలో ఇంటింటికీ సంక్షేమ లబ్ధి పేరిట వినూత్న ప్రచార కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 57 నెలల కాలవ్యవధిలో అమలుచేసిన అన్ని సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి పేరిట కరపత్రాలను ఈ కార్యక్రమం ద్వారా వారి ముందు ఉంచనున్నారు. రియల్‌ టైమ్‌ గవర్నె్‌స(ఆర్‌టీజీఎస్‌) ద్వారా లబ్ధిదారుల వివరాలను సేకరించి ఆయా మండల పరిషత్‌ల నుంచి గ్రామాల్లోని లబ్ధిదారుల ఇంటికి ఆ వివరాలు చేర్చడం ద్వారా ప్రభుత్వం మీ కుటుంబానికి ఇప్పటివరకు ఏం చేసిందనే సంక్షేమ లబ్ధిని స్పష్టం చేయడం ద్వారా వారిని ఆకర్షించనున్నారు.