రానా లాంటి వ్యక్తి తెలుగు తెరకు అవసరం

NENE RAJU NENE MANTRI-2
NENE RAJU NENE MANTRI Success Meet

రానా లాంటి వ్యక్తి తెలుగు తెరకు అవసరం

రానా కాజల్‌, కేథరిన్‌ హీరోహీరోయినుల్గఆ సురేష్‌ప్రొడక్షన్స్‌ , బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై రూపొందిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి ఆగస్టు 11న విడుదలైంది.. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడారు..సినిమాను ఇంత పెద్దహిట్‌చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని తెలిపారు.. రానాను ఏకోణంలో చూసినా నటుడే కనబడుతున్నాడని అన్నారు. పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ గారి తర్వాత మమ్మల్ని ముందు నడిపించిన వ్యక్తి రామానాయుడు అన్నారు. ఇవాళ ఆయన ఉండుంటే ఎంతో ఆనందపడేవారని అన్నారు. తేజ మాట్లాడుతూ, ముందు కథ అనుకోగానే ముందు రానాను కలిసి కథ చెప్పగానే ఎప్పుడు సినిమా చేస్తున్నాం..అని అన్నారన్నారు.. మన స్టార్‌ హీరోలు నెగెటివ్‌ రోల్స్‌ చేసే మనకు నచ్చదు అని కారణం వారి ఇమేజ్‌.. రానాకు ఇమేజ్‌ గొడవలేదని అన్నారు.ఇలాంటి పర్సన్‌ తెలుగు సినిమాకు ఎంతో అవసరం అని అన్నారు. రానా మాట్లాడుతూ, రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా రూపొందించిన చిత్రమిదని అన్నారు.. భార్యాభర్తల మధ్య ప్రేమ కథను ఇలా చేయటం కొత్తగా అన్పించిందన్నారు.. బాహుబలి2 ఘాజీ, ఇపుడు నేనేరాజునేనేమంత్రి సక్సెస్‌ అందుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు.