రాధికను రాజకీయ రంగ ప్రవేశం చేయించనున్న కుమారస్వామి?

Kumara swamy
Kumara swamy

బెంగుళూరు: ఈ నెలలో కర్ణాటక ఎన్నికలు జరిగిన విషయం విదితమే. అసెంబ్లీ ఎన్నికలలో రెండు చోట్ల నుంచి పోటీ చేసి రెండింటిలోను విజయం సాధించిన జెడిఎస్‌ అధినేత కుమారస్వామి, చెన్నపట్టణ నియోజకవర్గాన్ని ఉంచుకోని, రామనగర్‌ నియోజకవర్గాన్ని వదిలేశారు. ఈ సందర్భంగా రాజీనామాను సమరిపంచారు. మొదట చెన్నపట్టణ అసెంబ్లీని వదులుకుంటారని భావించినప్పటికీ, అక్కడ పోటీ చేసి ఓడిపోయిన బిజెపి అభ్యర్థి సిపి యోగేశ్వర్‌ బలమైన నేత కావడంతో అతనికి మరో అవకాశం ఇచ్చే ఉద్ధేశంలో కుమారస్వామి లేరని తెలుస్తోంది. ఇక మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నిక జరిగే రామనగర్‌ నుంచి తన భార్య రాధిక కుమారస్వామిని బరిలో దింపాలని జెడిఎస్‌ బలం కూడా తోడవ్వడంతో ఆమె గెలుపు ఖాయమేనని కుమారస్వామి భావిస్తున్నట్లు విశేషకుల సమాచారం.