రాత్రి 8గం.ల తర్వాత మద్యం బంద్‌…

ashok gehlot
ashok gehlot

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కఠిన నిర్ణయం….
జైపూర్‌: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. రాష్ట్రంలో 8గం.ల తర్వాత మద్యం అమ్మకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 8గం.ల తర్వాత కూడా మందు అమ్మితే వాళ్లపై భారీగా జరిమానాలు విధించండి. వాళ్ల షాపులు సీల్‌ చేసి, లైసెన్సులు రద్దు చేయండని ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులను ఆదేశించారు. చీఫ్‌ మినిస్టర్‌ ఆఫీస్‌లో సీనియర్‌ అధికారులతో సమావేశంలో గెహ్లాట్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2008లోనూ అప్పటి మా ప్రభుత్వం ఇలాంటి విధానమే తీసుకొచ్చింది. రాత్రి 8గం.ల తర్వాత మధ్యం అమ్మకపోవడం అన్నది సమాజానికి ఓ సానుకూల సందేశాన్ని ఇచ్చిందని ఆయన చెప్పారు. ఇక మద్యం దుకాణాల్లో ఎంఆర్‌పి కంటే ఎక్కువ ధరలను అమ్ముతున్నారన్న సమాచారంతో అలాంటి వాళ్లపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణాను కూడా అరికట్టాలని అధికారులను అశోక్‌ గెహ్లాట్‌ స్పష్టం చేశారు.